శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (12:58 IST)

కథ వెనుక కథ టీజ‌ర్‌ ఆసక్తిగా ఉందన్న గోపీచంద్ మ‌లినేని

katha venuka katha look
katha venuka katha look
న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ కొత్త కాన్సెప్ట్ తో దండమూడి బాక్సాఫీస్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న తొలి చిత్రం ‘కథ వెనుక కథ’. విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అవ‌నింద్ర కుమార్ నిర్మిస్తున్నారు.  సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతోన్న శుక్ర‌వారం ఈ మూవీ టీజ‌ర్‌ను క్రాక్‌, వీర సింహా రెడ్డి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను రూపొందించిన  స్టార్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని రిలీజ్ చేశారు. టీజ‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంద‌ని, సినిమా పెద్ద హిట్ కావాల‌ని చిత్ర యూనిట్‌కి అభినంద‌న‌లు తెలిపారు. 
 
75 సెకన్ల కథ వెనుక కథ టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే.. ఓ యంగ్ డైరెక్ట‌ర్ (విశ్వంత్) మ‌రో పాత్ర‌కు ఓ క్రైమ్ క‌థ‌ను చెప్ప‌టంతో టీజ‌ర్ స్టార్ట్ అవుతుంది. సిటీ చాలా వ‌ర‌కు మిస్సింగ్ కేసులుగా న‌మోదు అవుతున్న అమ్మాయిల‌ను ఎవ‌రో హ‌త్య చేస్తుంటారు. ఇంత భ‌యంక‌ర‌మైన హ‌త్య‌ల‌ను చేస్తున్న హంత‌కుడెవ‌రో పోలీసుల‌కు అంతు చిక్క‌దు. దీంతో వారు కేసుని స‌త్య (సునీల్‌) అనే సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌కి అప్ప‌గిస్తారు. సిటీలో జ‌రుగుతున్న హ‌త్య‌ల‌కు ఓ వ్య‌క్తి కార‌ణం కాద‌ని, ఓ గ్యాంగ్ క‌లిసి ఈ హ‌త్య‌ల‌ను చేస్తుంద‌ని స‌త్య‌కు తెలుసుకుంటాడు. మ‌రి ఈ విష‌యాన్ని స‌త్య ఎలా క‌నుక్కుకున్నాడు.. అత‌ను టీజ‌ర్‌లో చెప్పిన‌ట్లు మిస్ అయిన ఓ పాయింట్ ఏంటి? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే క‌థ వెనుక క‌థ టీజ‌ర్‌ను గ‌మ‌నించాల్సిందే. 
 
టీజ‌ర్‌లో పోలీసుల ఇన్వెస్టిగేష‌న్ ప్ర‌కారం విశ్వంత్ పాత్ర ప‌జిలింగ్‌గా అంద‌రూ అనుమాన ప‌డేలా క‌నిపిస్తుంది. మ‌రో వైపు ఇదే క్యారెక్ట‌ర్ 2019లో జ‌రిగిన దిశ రేప్, మ‌ర్డ‌ర్ కేసు గురించి చెప్ప‌టం అప్పుడు ప్ర‌జ‌ల్లో నుంచి వ‌చ్చిన ఎమోష‌న‌ల్ రియాక్ష‌న్స్‌, దానికి పోలీసులు చూపించిన యాక్ష‌న్ గురించి ప్ర‌స్తావ‌న ఉంటుంది. అస‌లు వ‌రుస హ‌త్య‌ల వెనుకున్న సీరియ‌ల్ లింకును సునీల్ ఏం మిస్ చేసుకున్నాడు అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సునీల్‌, విశ్వంత్ పాత్ర‌లు చాలా ఆస‌క్తిక‌రంగా క‌నిపిస్తున్నాయి. పోలీసులు చేసే ఇంట‌రాగేష‌న్‌, ప్రొసీజ‌ర్స్‌,  పోర్ష‌న్స్‌, బ్యాక్‌డ్రాప్ అనేది చాలా ఇంట్ర‌స్టింగ్‌గా అనిపిస్తుంది. 
 
నిర్మాత దండ‌మూడి అవ‌నీంద్ర కుమార్ క‌థ వెనుక క‌థ చిత్రాన్ని అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా, ప్రెస్టీజియ‌స్‌గా రూపొందించిన‌ట్లు విజువ‌ల్స్ చూస్తే క్లియ‌ర్ క‌ట్‌గా అర్థ‌మ‌వుతుంది. ఈ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ఆడియోను ఆదిత్య మ్యూజిక్ రిలీజ్ చేస్తుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. 
 
న‌టీన‌టులు: విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ, అలీ, సునీల్‌, జ‌య ప్ర‌కాష్‌, బెన‌ర్జీ, ర‌ఘు బాబు, స‌త్యం రాజేష్‌, మ‌ధు నంద‌న్‌, భూపాల్‌, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, ఖ‌య్యుం, ఈరోజుల్లో సాయి, రూప త‌దిత‌రులు