శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 13 మార్చి 2023 (17:27 IST)

మీటర్ లో చమక్ చమక్ పోరి.. మాస్ సాంగ్ తో కిరణ్‌ అబ్బవరం

Kiran Abbavaram mass song
Kiran Abbavaram mass song
హీరోగా తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్‌ చేసుకున్న యంగ్‌ టాలెంటెడ్‌ కథానాయకుడు కిరణ్‌ అబ్బవరం. ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఈ యువ హీరో నటిస్తున్న పక్కా మాస్‌కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌‘మీటర్‌’. టాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో  క్లాప్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌పతాకంపై చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. రమేష్‌ కాదూరి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఏప్రిల్ 7న  చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
కాగా  మీటర్ చిత్రం ప్రమోషన్ లో వేగం పెంచారు చిత్ర నిర్మాతలు ఇందులో భాగంగా ఇటీవల విడుదల చేసిన టీజరు కు  అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ చిత్ర మ్యూజిక్‌ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ చిత్రంలోని చమక్ చమక్ పోరి అనే మాస్ లిరికల్ పాటను తొలి లిరికల్ సాంగ్ గా ఈనెల 15న విడుదల చేస్తున్నారు. ఈ పాటలో హీరో కిరణ్ అబ్బవరం హీరోయిన్ అతుల్య రవి మాస్‌ డాన్స్ ను చూడబోతున్నారు.  సాయి కార్తీక్ బాణీలు ఈ డాన్స్ నెంబర్ వేగాన్ని మీటర్ ని మరింత పెంచాయి సాంగ్ పిక్చరైజేషన్ కూడా ఎంతో రిచ్ గా ఉంటుంది . ఈ  సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘కిరణ్ అబ్బవరం కెరీర్‌ లో అత్యధిక బడ్జెట్‌ తో నిర్మిస్తున్న మాస్ ఎంటర్‌ టైనర్ ఇది. ఆయనలోని కొత్తకోణాన్ని ఆవిష్కరిస్తూ దర్శకుడు చిత్రాన్ని తీర్చిదిద్దాడు. కిరణ్ అబ్బవరం ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్‌ఆఫీసర్‌గా కనిపిస్తాడు’ అన్నారు.