శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 9 మార్చి 2023 (16:23 IST)

వి.వి.వినాయ‌క్ క్లాప్ తో ప్రారంభం అయిన కిర‌ణ్ అబ్బ‌వ‌రం చిత్రం

VV Vinayak, Kiran Abbavaram
VV Vinayak, Kiran Abbavaram
కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా శివం సెల్యులాయిడ్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్-2గా ఒక సరికొత్త ల‌వ్ యాక్ష‌న్ డ్రామా రూపొంద‌నుంది. ఈ చిత్రం ద్వారా విశ్వ‌క‌రుణ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్స‌వం రామానాయుడు స్టూడియోస్ లో ఘ‌నంగా జ‌రిగింది. హీరోపై చిత్రీక‌రించిన ముహూర్తపు స‌న్నివేశానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ క్లాప్ కొట్టగా, ప్ర‌ముఖ నిర్మాత‌లు ద‌గ్గుబాటి సురేష్ బాబు, ఎ.ఎం.ర‌త్నం కెమెరా స్విచాన్ చేశారు. 
 
ఈ కార్య‌క్ర‌మానికి నిర్మాత‌లు కె.ఎస్.రామారావు, జెమిని కిర‌ణ్‌, శిరీష్, వ‌ల్ల‌భ‌నేని వంశీ, న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి, రామ్ తాళ్లూరి, దామోద‌ర‌ప్ర‌సాద్, కె.కె.రాధామోహ‌న్, బెక్కెం వేణుగోపాల్, ప్ర‌స‌న్న కుమార్, తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ‌ త‌దిత‌రులు అతిథులుగా హాజ‌రై సినిమా విజ‌యం సాధించాల‌ని శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ నెలలోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇత‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని నిర్మాత‌లు తెలియ‌జేశారు.