సమంతకు ఘన స్వాగతం పలికిన ఖుషి టీమ్ (video)
నటి సమంత ప్రభుకు ఖుషి టీమ్ ఘన స్వాగతం పలికింది. గత నెలలోనే ఆమె షూటింగ్‌కు హాజరు కావాల్సివున్నా ఓ వెబ్ సీరీస్ డేట్స్ వల్ల దాన్ని ముగించి వచ్చారు. అంతకుముందు కశ్మీర్‌లో విజయ్‌దేవరకొండపై కొన్ని సన్నివేశాలు తీశారు. సమంతకు ఆరోగ్యం బాగోలేదన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె పూర్తిగా కోలుకుని సెట్‌కు వచ్చారు.
స్ట్రాంగ్ లేడీ. స్ట్రాంగ్ అండ్ పవర్‌ఫుల్, ఇన్‌స్పైర్ లేడీ. 13 ఏళ్ళుగా ఇండస్ట్రీని లీడ్ చేస్తున్న సమంతకు స్వాగతం అంటూ బేనర్‌కు కట్టి ఆమెకు స్వాగతం పలికారు. చిత్ర హీరో విజయ్‌దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణ, మైత్రీ మూవీస్ అధినేతల్లో ఒకరైన రవి, ఇతర టీమ్ ఆమెకు స్వాగతంపలికాదు. మహిళా దినోత్సవం సందర్భంగా ఖుషి కేక్‌ను కట్ చేసిన ఆమె మహిళందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.