బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 7 మార్చి 2023 (17:12 IST)

ఇండియా డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను సందర్శించిన డెలివరూ సీఈఓ

KTR
డెలివరీ సీఈఓ విల్‌ షూ, మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌లోని డెలివరూ ఇండియా డెవలప్‌మెంట్‌ సెంటర్‌(ఐడీసీ)ని సందర్శించారు. డెలివరూ యొక్క అంతర్జాతీయ సాంకేతిక సంస్థలో ఈ కేంద్రం యొక్క కీలకమైన ప్రాధాన్యతను ఈ సందర్శన వెల్లడించడంతో పాటుగా నిర్ణయాత్మక అంతర్జాతీయ ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఫ్లాట్‌ఫామ్‌గా మారాలనే లక్ష్యమూ వెల్లడిస్తుంది.
 
తన భారతదేశ సందర్శనలో భాగంగా, సీఈఓ విల్‌ షూ, పలువురు స్టేక్‌హోల్డర్లతో సమావేశమయ్యారు. వీరిలో తెలంగాణా రాష్ట్ర ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, పురపాలక వ్యవహారాలు, నగరాభివృద్ధి, పరిశ్రమలు మరియు వాణిజ్య (ఐ అండ్‌ సీ) శాఖామాత్యులు శ్రీ కె టి రామారావు; తెలంగాణా ఐటీ, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖల ముఖ్యకార్యదర్శి శ్రీ జయేష్‌ రంజన్‌ ; బ్రిటీష్‌ డిప్యూటీ హై కమిషనర్‌, హైదరాబాద్‌ శ్రీ గారెత్‌ విన్‌ ఓవెన్‌ ఉన్నారు. గత సంవత్సర కాలంలో ఐడీసీ సాధించిన విజయాలు, చేరుకున్న మైలురాళ్లను, 2023 కోసం తామెంచుకున్న లక్ష్యాలు, వృద్ధి ప్రణాళికలు గురించి చర్చించారు.
 
మార్చి 2022లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు వెలుపల డెలివరూ యొక్క అతిపెద్ద టెక్‌ హబ్‌గా  ఐడీసీ ని ప్రారంభించారు. అప్పటి నుంచి భారతదేశంలో  ప్రపంచ శ్రేణి ఇంజినీరింగ్‌ బృందాన్ని నిర్మించడంలో భాగంగా తమ బహుళ సంవత్సరాల ప్రణాళికలో గణనీయమైన ప్రగతిని సాధించింది. ఈ కేంద్రంలో ప్రస్తుతం  140 మంది ఉద్యోగులు ఉన్నారు. 2023 సంవత్సరాంతానికి 200 మంది ఉద్యోగుల సంఖ్యను అధిగమించగలదని అంచనా. డెలివరూ ఇప్పుడు హైదరాబాద్‌కు ఆవల సైతం విస్తరించడంతో పాటుగా బెంగళూరు, గురగావ్‌ మరియు ముంబైలలో అగ్రగామి సాంకేతిక నిపుణులను సైతం షేర్డ్‌ స్పేస్‌ పార్టనర్‌ (కోవర్క్స్‌) ద్వారా చేరుకుంటుంది.
 
యుకెలో డెలివరూ యొక్క గ్లోబల్‌ టెక్నాలజీ టీమ్‌కు అవసరమైన మద్దతును పలు అంశాలలో ఈ ఐడీసీ అందిస్తుంది. గ్లోబల్‌ కేర్‌ అండ్‌ ట్రస్ట్‌, ఫైనాన్షియల్‌ సిస్టమ్స్‌, కన్స్యూమర్‌, డెలివరీ, గ్రోసరీ ప్లాట్‌ఫామ్‌, రెస్టారెంట్స్‌ మరియు ప్రొడక్ట్‌ ఇంజినీరింగ్‌ టీమ్‌ల వ్యాప్తంగా యుకె ఆధారిత టీమ్‌లలో తమను తాము భాగం  చేసుకుంటున్నారు. సంయుక్తంగా ఇంటిగ్రేటెడ్‌ ప్రాజెక్ట్‌లపై పనిచేయడంతో పాటుగా, ఈ ఐడీసీ టెక్‌ టీమ్‌ విస్తృత శ్రేణి ఉత్సాహపూరితమైన సాంకేతిక పరిష్కారాలపై పనిచేస్తుంది. వీటిలో వినియోగదారుల అనుభవాలను మెరుగుపరచడం, గ్రోసరీ అనుభవాలపై నేవిగేషన్‌ అభివృద్ధి చేయడం, డెలివరూ యొక్క అడ్వర్టయిజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అభివృద్ధి చేయడం మరియు ప్రమోషన్స్‌ మెరుగుపరచడం చేయనుంది.
 
డెలివరూ సీఈఓ మరియు ఫౌండర్‌ విల్‌ షూ మాట్లాడుతూ, ‘‘గత సంవత్సర కాలంలో డెలివరూ ఇండియా డెవలప్‌మెంట్‌ కేంద్రం సాధించిన విజయం పట్ల నేను సంతోషంగా ఉన్నాను. మా గ్లోబల్‌ టెక్‌ ఆర్గనైజేషన్‌లో అత్యంత కీలకమైన  భాగంగా ఇది నిలిచింది. హైపర్‌ లోకల్‌ స్థాయిలో మా వినియోగదారుల విలువ ప్రతిపాదనను నిరంతరం మెరుగుపరచడానికి సాంకేతికత మాకు సహాయం చేస్తుంది. వాస్తవ సమయంలో మా మార్కెట్‌ ప్రాంగణమంతటా మూడువైపులా ఎండ్‌ టు ఎండ్‌ ఆర్డర్‌ ప్రయాణాన్ని మెరుగుపరుస్తుంది మరియు మా వ్యాపారాన్ని సమర్థవంతంగా విస్తరించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలనూ అందిస్తుంది. భారతదేశంలో మా కార్యకలాపాలను మరింతగా 2023లో  విస్తరించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. దీనితో పాటుగా నిర్ణయాత్మక ఫుడ్‌ కంపెనీగా నిలువాలనే మా లక్ష్యం చేరుకుంటూ ప్రపంచశ్రేణి బృందాన్ని నిర్మించనున్నాము’’ అని అన్నారు.
 
హైదరాబాద్‌లో ఒక సంవత్సర కార్యకలాపాలు పూర్తి చేసిన తరువాత, ఐడీసీ తమ మార్కెట్‌ ప్లేస్‌లోని ప్రతివైపూ డెలివరూ యొక్క ప్రతిపాదనలను విస్తరించడంతో  పాటుగా కంపెనీ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లడానికి సాంకేతికతను వినియోగించడంపై  దృష్టి సారించింది. సరైన ప్రతిభావంతులను నియమించుకోవడం;  నాయకత్వ స్ధానాల్లోని వ్యక్తులను నియమించుకోవడం, మెరుగుపరచడం మరియు కార్యకలాపాలను వైవిధ్యీకరించడం చేయనున్నారు. 2023లో ఐడీసీ కోసం విద్యా భాగస్వామ్యాలు కూడా భాగంగా ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా సుప్రసిద్ధ  యూనివర్శిటీల నుంచి విభిన్నమైన నేపథ్యాలు కలిగిన ప్రతిభావంతులను ఆకర్షించనుంది.