భారతదేశంలో 200వ స్టోర్‌ను ప్రారంభించిన అసుస్
భారతదేశంలో తమ ప్రయాణంలో నూతన శిఖరాలను అందుకుంటూ, తైవనీస్ సాంకేతిక అగ్రగామి అసుస్ ఇండియా నేడు తమ 200వ స్టోర్‌ను న్యూఢిల్లీలో ప్రారంభించింది, దాదాపు 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టోర్ నగరానికి చెందిన ఎలక్ట్రానిక్ సెంటర్- నెహ్రూ ప్యాలెస్ వద్ద ఉంది. ఇది వినియోగదారులకు కన్స్యూమర్ పీసీలు, గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, ఆల్ ఇన్ ఒన్ డెస్క్‌టాప్‌లు మరియు ఇతర యాక్ససరీలకు చెందిన ప్రతిష్టాత్మక ఆవిష్కరణలను ముందుగా వీక్షించే అవకాశం అందిస్తుంది.
భారతదేశంలో వినియోగదారుల కొనుగోలు అనుభవాలను మరింతగా వృద్ధి చేయాలనే కంపెనీ యొక్క స్థిరమైన ప్రయత్నాలలో ఈ ఎక్స్‌క్లూజివ్ స్టోర్ కూడా ఓ భాగం. అసుస్ తమ 200వ స్టోర్ ప్రారంభించడంతో దేశవ్యాప్తంగా తమ రిటైల్ కార్యక్రమాలను వృద్ధి చేయడంతో పాటుగా భారతీయ మార్కెట్ పట్ల బ్రాండ్ నిబద్ధతను సైతం వెల్లడిస్తుంది.
ఈ స్టోర్ ప్రారంభం గురించి అసుస్ ఇండియా బిజినెస్ హెడ్, కన్స్యూమర్ అండ్ గేమింగ్ పీసీ, సిస్టమ్ బిజినెస్ గ్రూప్ అర్నాల్డ్ సు మాట్లాడుతూ, భారతదేశంలో మా 200వ స్టోర్ ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. మా విస్తరణ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్న వేళ ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన మైలురాయిగా నిలుస్తుంది, మాకు అత్యంత ముఖ్యమైన మార్కెట్ ఇండియా. మేము అత్యధిక రద్దీకలిగిన ప్రాంతాలలో మా స్టోర్లను ప్రారంభించనున్నాము. ఈ సంవత్సరం ప్రతి త్రైమాసంలోనూ కనీసం 20 స్టోర్లను జోడించాలనుకుంటున్నాము. తద్వారా మొత్తం స్టోర్ల సంఖ్యను 300కు తీసుకువెళ్లనున్నాము. మేము ఈ క్రమంలో కేవలం అర్బన్ మార్కెట్‌లలో మాత్రమే కాకుండా టియర్2, టియర్ 3 నగరాలలో సైతం స్టోర్లను తెరువనున్నాము అని అన్నారు. అసుస్ 2020లో 50 స్టోర్లను మాత్రమే కలిగి ఉంటే, 2023 నాటికి ఆ సంఖ్య 200కు చేరింది.