గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 4 నవంబరు 2022 (17:29 IST)

తిరుపతిలో ప్రత్యేక స్టోర్‌ను ప్రారంభించిన అసుస్‌

Asus
దేశవ్యాప్తంగా బ్రాండ్‌ యొక్క వాణిజ్య కార్యకలాపాలను మరింత విస్తరించడంలో భాగంగా తైవనీస్‌ సాంకేతిక సంస్థ అసుస్‌ ఇండియా నేడు తమ ప్రత్యేకమైన బ్రాండ్‌ స్టోర్‌ను తిరుపతిలో ప్రారంభించింది. ఈ స్టోర్‌లో కంపెనీ యొక్క మొత్తం శ్రేణి ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ అందుబాటులో ఉంటుంది. వీటిలో అసుస్‌ ప్రతిష్టాత్మకమైన ఉత్పత్తులు అయినటువంటి వివోబుక్‌, జెన్‌బుక్‌, జెన్‌బుక్‌- ఫ్లిప్‌, డెస్క్‌టాప్‌లు, రిపబ్లిక్‌ ఆఫ్‌ గేమర్స్‌ (ఆర్‌ఓజీ) ల్యాప్‌టాప్స్‌ ప్రదర్శించనున్నారు. తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న ఈ నూతన ఎక్స్‌క్లూజివ్‌ ప్రీమియం స్టోర్‌ 235 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.
 
ఈ విస్తరణ గురించి అర్నాల్డ్‌ సూ, బిజినెస్‌ హెడ్‌, కన్స్యూమర్‌ అండ్‌ గేమింగ్‌ పీసీ, సిస్టమ్‌ బిజినెస్‌ గ్రూప్‌, అసుస్‌ ఇండియా మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో మా వాణిజ్య కార్యకలాపాలు విస్తరిస్తున్నామని వెల్లడిస్తుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. మాకు అతి ముఖ్యమైన మార్కెట్‌లలో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. ఈ నూతన బ్రాండ్‌ స్టోర్‌ను తిరుపతిలో ప్రారంభించడమన్నది దేశ వ్యాప్తంగా విభిన్న ప్రాంతాలలో మా తాజా ఆవిష్కరణలతో వినూత్న అనుభవాలను అందించడం ద్వారా  వినియోగదారులకు తగిన శక్తిని అందించాలనే మా ప్రయత్నాలలో కీలకమైన ముందడుగుగా నిలుస్తుంది. వ్యూహాత్మక వాణిజ్య విస్తరణ విధానంతో, మా వినియోగదారులకు మరింత ఇంటరాక్షన్‌ సృష్టించడంతో పాటుగా టచ్‌పాయింట్లను సైతం అందించడం కొనసాగించనున్నాము’’ అని అన్నారు.
 
తిరుపతిలో ఇది బ్రాండ్‌కు మొట్టమొదటి రిటైల్‌ స్టోర్‌. ఈ స్టోర్‌ వినూత్నమైన డెమో జోన్స్‌ కలిగి ఉంది. ఇవి ప్రీమియం అనుభవాలను, సేవలను వినియోగదారులకు అందించనున్నాయి. ఇవి వినియోగదారులకు బ్రాండ్‌ యొక్క తాజా గేమింగ్‌, లైఫ్‌ స్టైల్‌ ఉత్పత్తులు అయినటువంటి పీసీలు, డెస్క్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, విస్తృతశ్రేణి యాక్ససరీలు వ్యాప్తంగా అత్యాధునిక ఫీచర్లను తొలిసారిగా వీక్షించే అవకాశం అందిస్తూనే అనుసంధానిత అనుభవాలనూ సృష్టిస్తాయి.