గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 10 నవంబరు 2022 (20:38 IST)

17.3 అంగుళాల ఫోల్డబుల్‌ ల్యాప్‌టాప్‌, జెన్‌బుక్‌ 17 ఫోల్డ్‌ ఓఎల్‌ఈడీని విడుదల చేసిన అసుస్‌

Zenbook
తైవనీస్‌ టెక్నాలజీ సంస్ధ అసుస్‌ ఇండియా నేడు తమ విప్లవాత్మక ఆవిష్కరణ జెన్‌బుక్‌ 17 ఫోల్డ్‌ ఓఎల్‌ఈడీని విడుదల చేసినట్లు వెల్లడించింది. ప్రపంచంలో మొట్టమొదటి 17.3 అంగుళాల ఫోల్డబల్‌ ఓఎల్‌ఈడీ ల్యాప్‌టాప్‌ ఇప్పుడు భారతదేశంలో లభ్యమవుతుంది. అత్యంత సౌకర్యవంతమైన, తేలికైన 12.5 అంగుళాల ఫోల్డబల్‌ ఓఎల్‌ఈడీ ల్యాప్‌టాప్‌ వైవిధ్యమైన 17.3 అంగుళాల డివైజ్‌లో ఇమిడిపోవడంతో పాటుగా ఆరు మోడ్స్‌లో కేవలం 1.5 కేజీల బరువు (కీ బోర్డ్‌ లేకుండా ) ఉంటుంది.
 
జెన్‌బుక్‌ 17 ఫోల్డ్‌ ఓఎల్‌ఈడీలో అత్యాధునిక 12వ తరపు ఇంటెల్‌ కోర్‌ ఐ7-1250యు ప్రాసెసర్‌ ఉంది. ఇది 10 కోర్స్‌ (రెండు పెర్‌ఫార్మెన్స్‌ కోర్‌లు మరియు 8 ఎఫిషీయెన్సీ కోర్‌లు ఉంటాయి) కలిగి ఉండటంతో పాటుగా 4.7 గరిష్ట ఫ్రీక్వెన్సీ వరకూ వేగంతో అన్ని టాస్క్‌లను అత్యంత సులభంగా నిర్వహించేలా చేస్తుంది. అంతేకాదు, ఈ ల్యాప్‌టాప్‌ 16జీబీ 5200మెగా హెర్ట్జ్‌ ఎల్‌పీడీడీఆర్‌5 ర్యామ్‌ కలిగి ఉంది. ఈ జెన్‌బుక్‌ 17 ఫోల్డ్‌ , ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే కలిగి ఉండటంతో పాటుగా  భారతీయ వినియోగదారులకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో 3,29,990 రూపాయలకు లభ్యమవుతుంది.
 
ఈ ఆవిష్కరణ గురించి అసుస్‌ ఇండియా బిజినెస్‌ హెడ్‌, కన్స్యూమర్‌ అండ్‌ గేమింగ్‌ పీసీ, సిస్టమ్‌ బిజినెస్‌ గ్రూప్‌ అర్నాల్డ్‌ సు మాట్లాడుతూ, ‘‘భారతీయ మార్కెట్‌లో మా అత్యద్భుతమైన ఆవిష్కరణ జెన్‌బుక్‌ 17 ఫోల్డ్‌ ఓఎల్‌ఈడీను విడుదల చేయడం పట్ల సంతోషంగా ఉన్నాము. ప్రపంచంలో మొట్టమొదటి 17.3 అంగుళాల ఫోల్డబల్‌ ల్యాప్‌టాప్‌ ఇది. ప్రొప్రైయిటరీ ఫోల్డబల్‌ హింజ్‌ డిజైన్‌ను ఇది వినియోగించుకుంటుంది. ఇంటెల్‌, బీఓఈతో కలిసి దీనిని అభివృద్ధి చేశాము. ఇది  పరివర్తన పూర్వక అనుభవాలను అందిస్తుంది. ఇది ల్యాప్‌టాప్‌ యొక్క పోర్టబిలిటీని డెస్క్‌టాప్‌ యొక్క ఉత్పాదకతతో అందిస్తుంది. విభిన్నమైన వాతావరణాలు, అంటే ఆఫీస్‌, ఇల్లు లేదంటే ప్రయాణాలు లేదా విశ్రాంత సమయాల్లో  రాజీపడే అవసరాన్ని ఈ ల్యాప్‌టాప్‌లు తప్పిస్తాయి. అదే సమయంలో రెండు అత్యంత ఆకర్షణీయమైన స్ర్కీన్‌ పరిమాణాలు, బహుళ వినియోగ విధానాలలో  ఆకర్షణీయంగా చేర్చడం ద్వారా ఆకట్టుకుంటుంది’’ అని అన్నారు.