శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2022 (09:12 IST)

నేడు పెగసస్ స్పైవేర్‌పై సుప్రీంకోర్టు విచారణ

suprem court
దేశాన్ని ఓ కుదుపు కుదిపిన పెగాసస్ స్పైవేర్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు గురువారం కీలక విచారణ చేపట్టనుంది. ఈ కేసుతో పాటు మరో మూడు కీలక కేసులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంంలోని ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 
 
ఈ ముూడు కీలక కేసుల్లో బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను విడుదల చేస్తూ దాఖలైన పిటిషన్‌తో పాటు పీఎల్ఎంఏపై ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు జనవరిలో పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా లోపాలపై దాఖలైన పిటిషన్లపై సైతం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 
 
వీటన్నింటిలోకెల్లా పెగాసస్ స్పైవేర్ కేసు అత్యంత కీలకంగా ఉంది. జర్నలిస్టులు, పార్లమెంటేరియన్లు, ప్రముఖులపై గూఢచర్య చేసేందుకు ప్రభుత్వం ఇజ్రాయేల్ మిలిటరీ నుంచి గ్రేడ్ మాల్వేను‌ కేంద్రం కొనుగోలు చేసి ఉపయోగించిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇప్పటికే స్వతంత్ర దర్యాప్తును కోరుతూ దాఖలైన పిటిషన్‌‍ను స్వీకరించిన సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్ నేతృత్వంలో త్రిసభ్య కమిటినీ గత యేడాది అక్టోబరు నెలలో నియమించిన విషయం తెల్సిందే.