గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 ఆగస్టు 2022 (10:09 IST)

అమేజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు గుడ్ న్యూస్.. ఆగస్టు 6 నుంచి..?

Amazon
అమేజాన్ ప్రైమ్ మెంబర్‌ల కోసం అమేజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ కస్టమర్లకు అమేజాన్ సేల్ ఆగస్టు 5 అర్ధరాత్రి ప్రారంభం కాగా, ఇతర కస్టమర్ల కోసం ఈ సేల్ ఆగస్టు 6 నుండి ప్రారంభమవుతుంది.

ఈ సేల్‌ ఆగస్టు 10 వరకు కొనసాగనుంది. ఈ సేల్ సమయంలో అనేక ఉత్పత్తులు తగ్గింపు పొందవచ్చు. పలు స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్‌ అందుబాటులో ఉండనుంది. సేల్ సమయంలో, పలు టీవీ మోడళ్లపై 60 శాతం వరకు భారీ తగ్గింపు అందించబడుతోంది.  

అమేజాన్‌లు పలు ఉత్పత్తులపై అదనపు తగ్గింపు పొందవచ్చు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్రెడిట్‌ కార్డును ఉపయోగించి అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ పొందవచ్చు. అలాగే కస్టమర్ల సౌలభ్యం కోసం ఎలాంటి వడ్డీ లేకుండా ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందని అమేజాన్‌ తెలిపింది.