అసుస్ జెన్‌బుక్ 14ఎక్స్ ఓఎల్‌ఈడీ స్పేస్ ఎడిషన్ ఆవిష్కరణతో ఎంఐఆర్ స్పేస్ మిషన్
తైవనీస్ టెక్నాలజీ అగ్రగామి సంస్థ అసుస్ నేడు తమ నూతన జెన్‌బుక్ 14 ఎక్స్ ఓఎల్‌ఈడీ స్పేస్ ఎడిషన్‌ను విడుదల చేసింది. భారతదేశంలో మొట్టమొదటి అసుస్ ల్యాప్‌టాప్‌ను అంతరిక్షంలో పంపి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దీనిని విడుదల చేశారు. జెన్‌బుక్ 14ఎక్స్ ఓఎల్‌ఈడీ స్పేస్ ఎడిషన్ అనేది ప్రత్యేకమైన ల్యాప్‌టాప్ ఎడిషన్. గతంలో ఎన్నడూ చూడని అసాధారణ ఫీచర్లను ఇది కలిగి ఉంది.
యువ ప్రొఫెషనల్స్, సాంకేతికత పట్ల అమితాసక్తి కలిగిన ట్రెండ్‌సెట్టర్లు, స్టోరీ టెల్లర్లు, అంతరిక్షం మరియు శాస్త్ర విజ్ఞాన ప్రియుల కోసం వీటిని డిజైన్ చేశారు. అసుస్ ఇప్పుడు జెన్‌బుక్ 14 ఓఎల్‌ఈడీ ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను 2022 కోసం విడుదల చేసింది. వీటితో పాటుగా నూతన వివో బుక్ ఎస్ సిరీస్- వివోబుక్ ఎస్ 14/15 ఓఎల్‌ఈడీ ల్యాప్‌టాప్‌లను సైతం విడుదల చేసింది. జెన్‌బుక్ 14ఎక్స్ ఓఎల్‌ఈడీ స్పేస్ ఎడిషన్ ధరలు 1,14,990 రూపాయలు కాగా, జెన్‌బుక్ 14 ఓఎల్‌ఈడీ (యుఎక్స్3402) ధర 89,990 రూపాయలు. వివోబుక్ ఎస్ సిరీస్ ధర 74,990 రూపాయలు. వీటిని ఆన్‌లైన్‌లో (అసుస్ ఈ-షాప్/అమెజాన్/ఫ్లిప్‌కార్ట్ మరియు ఆఫ్‌లైన్‌లో (అసుస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు/ఆర్‌ఓజీ స్టోర్లు /క్రోమా/విజయ్ సేల్స్/రిలయన్స్ డిజిటల్) లభిస్తుంది.
దాదాపు 25 సంవత్సరాల క్రితం అసుస్ పీ6300 ల్యాప్‌టాప్ 600 రోజులు అత్యంత ప్రాచుర్యం పొందిన ఎంఐఆర్ స్పేస్ స్టేషన్‌లో గడిపింది. ఎంఐఆర్ స్పేస్ స్టేషన్ అనేది అంతరిక్షంలో సుదీర్ఘకాలం గడిపిన స్పేస్ స్టేషన్‌గా నిలిచింది. అసుస్ ల్యాప్ టాప్ బోర్డ్‌పై ఉండగా, ఎంఐఆర్ విద్యుత్ సమస్యలు ఎదుర్కొవడంతో పాటుగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. కానీ ల్యాప్‌టాప్ మాత్రం ఈ మిషన్ ఎలాంటి లోపం లేకుండా పూర్తి చేయడంలో సహాయపడింది. పీ6300 ల్యాప్‌టాప్ అసుస్ అభివృద్ధి చేసి రూపొందించిన ప్రతి ఉత్పత్తిలోనూ అత్యున్నత ప్రమాణాలు నిర్ధేశించింది. అసుస్ ఈ ప్రత్యేక స్పేస్ ఎడిషన్ జెన్‌బుక్‌ను గతాన్ని గుర్తు చేస్తూనే భవిష్యత్‌ను వేడుక చేసే రీతిలో తీర్చిదిద్దింది.
ఈ ఆవిష్కరణ గురించి అర్నాల్డ్ సు, బిజినెస్ హెడ్, కన్స్యూమర్ అండ్ గేమింగ్ పీసీ, సిస్టమ్ బిజినెస్ గ్రూప్, అసుస్ ఇండియా మాట్లాడుతూ, అసుస్ వద్ద, మేము స్థిరంగా కేవలం పనితీరు పరంగా మాత్రమే అత్యున్నతమైన ఉత్పత్తులను తీర్చిదిద్దడంతో పాటుగా మా వినియోగదారులకు వినూత్న అనుభవాలను సైతం అందిస్తున్నాము. నూతన జెన్‌బుక్ స్పేస్ ఎడిషన్‌తో మా ఆవిష్కరణల రజతోత్సవం వేడుక చేసుకునేందుకు ఇంటెల్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. దీని ద్వారా మాఆధునిక జీవనశైలి ల్యాప్‌టాప్‌ను జీవితానికి తీసుకువచ్చాము.
మా విస్తృత శ్రేణి ఉత్పత్తులకు నూతన ఎడిషన్ జోడింపుతో అసుస్ వాగ్ధానమైనటువంటి అత్యున్నత నాణ్యత కలిగిన సాంకేతికతతో ప్రతి ఒక్కరికీ సాధికారితను అందిస్తున్నాము. అదనంగా, మేము తాజా జెన్‌బుక్ సిరీస్ పరిచయం చేయడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. అంతేకాదు, వివోబుక్ ఎస్ సిరీస్ 14/15 ఓఎల్‌ఈడీతో మా ప్రధాన స్రవంతి నోట్‌బుక్ శ్రేణి విస్తరించనున్నాము అని అన్నారు.
రాహుల్ మల్హొత్రా, డైరెక్టర్, కన్స్యూమర్ సేల్స్, ఇంటెల్ ఇండియా మాట్లాడుతూ, అసుస్ జెన్ బుక్ 14ఎక్స్ ఓఎల్‌ఈడీ స్పేస్ ఎడిషన్‌కు మా అత్యుత్తమ 12వ తరపు ఇంటెల్ కోర్ హెచ్ సిరీస్ ప్రాసెసర్లు తగిన శక్తిని అందిస్తున్నాయి. రెండు విభిన్నమైన కోర్ ఆర్కిటెక్చర్‌లను ఒకే ప్రాసెసర్‌లో ఇవి మిళితం చేశాయి. మా 12వ తరపు ఇంటెల్ కోర్ ప్రాసెసర్లుతో వినియోగదారులు కేవలం ఈ శ్రేణిలో అత్యుత్తమ పనితీరు పొందడంతో పాటుగా పరిశ్రమలో మొట్టమొదటి ఫీచర్లు అయిన డీడీఆర్‌ఎస్ మెమరీ సపోర్ట్ కూడా కలిగి ఉంది. దీనితో పాటుగా అత్యంత వేగవంతమైన కనెక్టివిటీ అవకాశాలు థండర్ బోల్డ్ 4 మరియు వైఫై 6ఈ కలిగి ఉంది. అసుస్‌తో మా సుదీర్ఘమైన అనుబంధం పట్ల గర్వంగా ఉన్నాము. సృజనాత్మక కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్స్‌ను ఇవి అందించడంతో పాటుగా ప్రపంచశ్రేణి మొబైల్ కంప్యూటింగ్ అనుభవాలు సైతం అందించనుంది అని అన్నారు.