శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 డిశెంబరు 2021 (14:38 IST)

పెగాసస్‌కు మమతా బెనర్జీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు...

వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. పెగాసస్ స్నూపింగ్ వ్యవహారంలో బెంగాల్ ప్రభుత్వం జస్టిస్ లోకూర్ కమిషన్ ఏర్పాటు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు స్పందింది. సుప్రీంకోర్టు ఇప్పటికే స్వతంత్ర కమిటీ వేసిందని, అలాంటపుడు మరో కమిటీ ఎందుకంటూ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 
 
అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా కమిటీ ఏర్పాటు చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ స్నూపింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఒక స్వతంత్ర కమిటీ దర్యాప్తునకు ఆదేశించిందనీ, ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా మరో కమిటీ ఎందుకు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 
 
ఈ పెగాసస్ స్నూపింగ్ కేసు దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ పెగాసస్ వ్యవహారం పార్లమెంట్ ఉభయసభలను కుదిపేసింది. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీతో పాటు.. విపక్ష సభ్యులంతా ఏకమై పార్లమెంట్‌ను స్తంభింపజేశారు. ముఖ్యంగా రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి పేపర్లు చింపి ఛైర్మన్ మీదకు విసిరేశారు.