1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 డిశెంబరు 2021 (13:01 IST)

కాలుష్యం పాకిస్థాన్ నుంచి వస్తోంది.. యూపీ : అక్కడి పరిశ్రమలు మూయించాలా?

ఢిల్లీ కాలుష్యంపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు ఒక కొత్త విషయాన్ని తెలిపింది. పాకిస్థాన్ నుంచి కాలుష్యం వస్తుందని చెప్పింది. దీంతో సుప్రీంకోర్టు కలుగజేసుకుని పాకిస్థాన్ దేశంలోని పరిశ్రమలను మూయించివేద్దామా? అంటూ ప్రశ్నించింది. ఈ కాలుష్యాన్ని అరికట్టేందుకు తమ రాష్ట్రంలోని పరిశ్రమలను మూసి వేయించేందుకు ఉత్తరప్రదేశ్ ససేమిరా అంటోంది. పైగా, ఈ కాలుష్యం అంతా పొరుగు దేశమైన పాకిస్థాన్ నుంచి వస్తుందంటూ సుప్రీంకోర్టుకు చెప్పడం వింతగా వుంది. 
 
ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోమారు శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా యూపీ ప్రభుత్వం కోర్టుకు ఒక అఫిడవిట్ సమర్పించింది. ఇందులో దేశ రాజధాని ప్రాతంలోని కాలుష్యానికి యూపీ పరిశ్రమలతో సంబంధం లేదని పేర్కొంది. 
 
అంతేకాకుండా తమ రాష్ట్రంలోని పరిశ్రమలను మూసి వేయడానికి అభ్యంతరం తేలిపింది., పైగా, రాజధాని ప్రాంతంలోని పరిశ్రమలు 8 గంటలే పనిచేయాలన్న కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ నిర్ణయం పట్ల చెరకు, పాల ఉత్తత్తుల పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతాయని పేర్కొంది. 
 
దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏం చేయమంటారు.. పాకిస్థాన్‌లోని పరిశ్రమలను మేం మూసేయించాలా? వాటిపై నిషేధం విధించమంటారా? అంటూ అసహన వ్యక్తం చేశారు.