గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 డిశెంబరు 2021 (12:45 IST)

ఈ నెల 20 నుంచి 24 వరకు బొల్లారంలో రాష్ట్రపతి విడిది

భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్ నగరంలోని బొల్లారంలో విడిది చేయనున్నారు. ప్రతి యేటా శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి బొల్లారంకు వస్తున్న విషయం తెల్సిందే. 
 
ఇందులోభాగంగా, ఈ నెల 20వ తేదీన బొల్లారంకు వచ్చి ఐదు రోజుల పాటు ఆయన బొల్లారం రాష్ట్రపతి భవన్‌లో బస చేయనున్నారు. అయితే, దేశంలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా ఈ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 
 
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో దిండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు ఆయన తొలుత చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బొల్లారం రాష్ట్రపతి విడిదికి వస్తారు. దీనికి సంబంధించిన ప్రోటోకాల్ విభాగం ఏర్పాట్లను ప్రారంభించింది. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అక్టోపస్ పోలీసులు రాష్ట్రపతి నిలయంలో మాక్ డ్రిల్ కూడా చేపట్టారు.