ఆదివారం, 3 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (17:54 IST)

హైదరాబాదుకు వచ్చేసిన ఒమిక్రాన్... బ్రిటన్ నుంచి ఇండియాకు

భారత్‌లోకి ఒమిక్రన్ ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పటికే ప్రపంచ దేశాలు కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌ పట్ల అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాదుకే ఒమిక్రాన్ వచ్చేసింది. ఇటీవల బ్రిటన్ నుంచి హైదరాబాద్ వచ్చిన మహిళకు ఓమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లు నిర్థారణ అయినట్లు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు తెలిపారు. 
 
అలాగే జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం మహిళ నమూనాలను ల్యాబుకు పంపినట్లు శ్రీనివాస్ రావు తెలిపారు. విదేశాల నుంచి హైదరాబాద్‌కు 325 మంది రాగా.. వారిలో మహిళకు పాజిటివ్‌ రావడంతో.. ఆమెను గచ్చిబౌలి టిమ్స్‌ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. నెగెటివ్ వచ్చిన వారికి వారం తర్వాత మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారు.