బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (10:52 IST)

దేశంలో కొత్తగా 9,465 కరోనా కేసులు - మృతులు 477

ఒకవైపు ప్రపంచాన్ని ఒమిక్రాన్ కరోనా వేరియంట్ భయపెడుతోంది. మరవైపు, దేశంలో కరోనా వైరస్  పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 9765 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, 477 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. 
 
అలాగే, గత 24 గంటల్లో మరో 8548 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే, 477 మంది మృత్యువాతపడగా, ఇప్పటివరకు కరోనా వైరస్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 4,69,724కు చేరుకుంది. 
 
అలాగే, ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,46,06,541 కాగా ఉంది. అలాగే, దేశ వ్యాప్తంగా 1,24,96,515 మందికి కరోనా టీకాలను వేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.