సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 నవంబరు 2021 (10:29 IST)

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో మరో 9 వేల కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. 
 
ఈ వైద్య బులిటెన్ మేరకు గత 24 గంటల్లో 9,283 పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఈ కేసులతో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 3,45,35,763కు పెరిగాయి. ఇందులో 3,39,57,698 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 
 
అలాగే, దేశ వ్యాప్తంగా 1,11,481 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా మరో 4,66,584 మంది ఈ వైరస్ వల్ల చనిపోయారు. ఒక్క 24 గంటల్లోనే 437 మంది చనిపోయారు. అలాగే, 10949 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు.