1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 నవంబరు 2021 (22:48 IST)

హలాల్ చేసిన మాంసాన్ని మాత్రమే తినాలి.. క్రికెటర్లకు బీసీసీఐ సూచన

భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు రంగం సిద్ధం అవుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా ఈ నెల 25వ తేదీన కాన్పూర్‌లో తొలి టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా  ఆటగాళ్ల కోసం సిద్ధం చేసిన కొత్త ఫుడ్ మెనూ విడుదలైంది. ఈ ఫుడ్ మెనూ ప్రస్తుతం చర్చకు దారితీసింది.  
 
ఇందులో 'హలాల్' చేసిన మాంసాన్ని మాత్రమే తినాలని బీసీసీఐ ఆటగాళ్లను కోరింది. ఈ విషయంపై ఇపుడు సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది.

బీసీసీఐ విడుదల చేసిన కొత్త మెనూలో ఆటగాళ్లు కచ్చితంగా హలాల్ మాంసాన్ని మాత్రమే తినాలని విషయంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టిందని... ఆటగాళ్ల ఫుడ్ మెనూలోనుంచి పంది, గొడ్డు మాంసాన్ని బీసీసీఐ తిలగించటం వంటి విషయాలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు.
 
నిజానికి ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ దృష్ట్యా ఇక నుంచి అందరికీ హలాల్‌ మాంసాన్ని మాత్రమే అందించాలని బీసీసీఐ నిర్ణయించిందని. అయితే గొడ్డు మాంసం తినొద్దు అన్న దానిపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ సాగుతోంది.