సోమవారం, 6 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (13:51 IST)

సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం.. ఐసీసీ ఛైర్మన్‌గా నియామకం

టీమిండియా మాజీ క్రికెటర్, బిసిసిఐ ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం లభించింది. ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్‌ గా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బుధవారం నియామకం అయ్యారు.

ganguly
మంగళవారం దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బోర్డు సమావేశంలో ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్‌ గా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని నియామకం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 
 
గత కొన్ని ఏళ్లుగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. క్రికెట్ కు చేస్తున్న.. సేవలకు ఈ పదవి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ).

ఐసిసి పురుషుల క్రికెట్ కమిటీ అధ్యక్ష పదవికి సౌరవ్‌ను స్వాగతిస్తున్నందుకు తాను సంతోషిస్తున్నానని… ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు గంగూలీ అని ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే అన్నారు. ఈ పదవి కి సౌరవ్ గంగూలీ.. చాలా భాగా సెట్ అవుతాడని పేర్కొన్నారు. ఇక అటు బీసీసీఐ సభ్యులతో పాటు.. క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.