1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Sajjala Ramakrishna Reddy confident of YSRCP sweep in next election

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

sajjala ramakrishna reddy
పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోందని, అందువల్ల ఎపుడు ఎన్నికలు జరిగినా విజయం మాత్రం తమదేనని ఆ పార్టీ సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి జోస్యం చెప్పారు. ఆయన సోమవారం తాడేపల్లి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఏపీలో ఎపుడు ఎన్నికలు జరిగినా వైకాపా రికార్డు స్థాయిలో మెజార్టీతో విజయం సాధిస్తుందని, ఈ విషయంపై ప్రజల్లోనూ, పార్టీ శ్రేణులల్లోనూ బలమైన నమ్మకం ఉందన్నారు. 
 
కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ, వేధింపులకు గురిచేస్తోందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా.. ప్రజల మద్దతు మాకే ఉందని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమ పథకాల అమలును పూర్తిగా విస్మరించారని రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు. సామాన్యులు కూడా దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారని, పాలన పూర్తిగా గాడితప్పిందన్నారు. వచ్చే ఎన్నికల్లోనే కాకుండా ఇకపై మళ్లీ గెలవలేమన్న భయంతో కూటమి నేతలు అడ్డగోలుగా దోచుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు