గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టరుగా వీవీఎస్ లక్ష్మణ్

హైదరాబాద్ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కీలక బాధ్యతలను చేపట్టనున్నారు. జాతీయ క్రికెట్ అకాడ‌మీ డైరెక్ట‌ర్‌గా వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ నియామ‌కంకానున్నారు. బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ ఈ విషయాన్ని ఆదివారం ధృవీక‌రించారు. 
 
త్వ‌ర‌లోనే ఎన్‌సీఏ డైరెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రిస్తార‌ని గంగూలీ స్ప‌ష్టం చేశారు. ఇండియాలో క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు మాజీ క్రికెటర్లను భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయప‌డిన విష‌యం తెలిసిందే. 
 
రాహుల్ ద్రవిడ్‌ను భారత జట్టు ప్రధాన కోచ్‌గా ఉండేలా గంగూలీ అంగీకరింపజేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు వీవీఎస్ లక్ష్మణ్ జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్‌గా బాధ్యతలు చేపట్టాలని గంగూలీ ఆకాంక్షించారు.