మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 నవంబరు 2021 (14:27 IST)

పాకిస్థాన్‌లో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ.. భారత్ కూడా వెళ్తుంది..

2025 ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్‌లో నిర్వహించేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు ఐసీసీ తెలిపింది. ఈ టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌కు అన్నీ జట్లు వెళ్తాయని ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్ క్లే  చెప్పారు. గత కొన్ని వారాల్లో ఏం జరిగిందన్నది అప్రస్తుతమని, షెడ్యూల్ కు ఎవరూ అడ్డు చెప్పలేదని అన్నారు. 
 
ఈ ఈవెంట్‌ను నిర్వహించే శక్తి పాకిస్థాన్ కు లేదని భావిస్తే అసలు ఐసీసీనే ఆ ఈవెంట్‌ను పాకిస్థాన్ కు ఇచ్చేది కాదన్నారు. పాకిస్థాన్‌కు ఇదో గొప్ప అవకాశమన్నారు. టోర్నమెంట్ నిర్వహించే 2025కు ఇంకా చాలా సమయం ఉందని, అప్పటివరకు అన్ని దేశాల ఆటగాళ్ల భద్రతకు సంబంధించి పటిష్ఠమైన చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. 
 
భారత్‌ను పాక్‌లో ఆడించడం కొంత సవాల్ తో కూడుకున్నదేనని, కానీ, క్రికెట్ రెండు దేశాల మధ్య సమస్యలను పరిష్కరిస్తుందన్న ఆశాభావం ఉందని బార్ క్లే చెప్పారు. ఇండియా కూడా పాక్ లో చాంపియన్స్ ట్రోఫీలో భాగమవుతుందని అన్నారు.