గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 నవంబరు 2021 (19:47 IST)

కోల్‌కతా ట్వంటీ20 మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్

మూడు ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా, చివరి టీ20 మ్యాచ్ ఆదివారం కోల్‌కతా వేదికగా భారత్ - న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న రోహిత్ శర్మ సేన... ఇపుడు చివరి ట్వంటీ20లోనూ గెలుపొంది సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలన్న పట్టుదలతో ఉంది. 
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్... తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఓపెనర్ రాహుల్, స్పిన్నర్ అశ్విన్‌కు విశ్రాంతి నివ్వగా, వారి స్థానాల్లో ఇషాన్ కిషన్, యజువేంద్ర చాహల్‌కు చోటు కల్పించారు. 
 
అలాగే, కివీస్ జట్టులో కూడా ఒక మార్పు చేశారు. ఆ జట్టు సారథి పేసర్ టిమ్ సౌథీ ఈ మ్యాచ్‌కు దూరంకాగా, స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన భారత్ 8 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. ఇందులో రోహిత్ శర్మ 42, ఇషాన్ ఖాన్ (29), సూర్య కుమార్ యాదవ్ డకౌట్, రిషబ్ పంత్ 4 పరుగులతే క్రీజ్‌లో ఉన్నారు.