బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 నవంబరు 2021 (19:14 IST)

రాంచీ ట్వంటీ20 : టాస్ గెలిచిన రోహిత్ - కివీస్ బ్యాటింగ్

స్వదేశంలో పర్యాటక జట్టు న్యూజిలాండ్‌తో జరుగుతున్న ట్వంటీ 20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాంచీ వేదికగా రెండో మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో ఒక మార్పు చేశారు.
 
తొలి ట్వంటీ20లో గాయపడిన మహ్మద్ సిరాజ్ స్థానంలో ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించి, పర్పుల్ క్యాప్ అందుకున్న హర్షల్ పటేన్‌కు అవకాశం కల్పించారు. ఇది ఇతనికి తొలి ట్వంటీ20 మ్యాచ్ కావడం గమనార్హం. 
 
అలాగే, న్యూజిలాండ్ జట్టులో మూడు మార్పులు చేశారు. లోకీ ఫెర్గ్యూసన్, రచిన్ రవీంద్ర, టాడ్ ఆసిల్‌లను తప్పించి వారి స్థానంలో ఆడమ్ మిల్నే, ఇష్ సోధి, జిమ్మీ నిషమ్‌లకు చోటు కల్పించారు. కాగా, తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా, ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది.