1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 డిశెంబరు 2021 (19:11 IST)

ఆసుస్ నుంచి కొత్త ల్యాప్‌టాప్‌లు: ఫీచర్స్ ఇవే.. ధరెంతంటే?

ఆసుస్ నుంచి కొత్త ల్యాప్‌టాప్‌లు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో డిసెంబ‌ర్ 14 నుంచి అందుబాటులోకి రానుంది. ఇక ప్రొఆర్ట్ స్టూడియో బుక్ రేంజ్ జ‌న‌వ‌రి నుంచి ల‌భిస్తుంది. మంగ‌ళవారం భార‌త్‌లో రూ 74,990 ప్రారంభ ధ‌ర‌తో న్యూ ల్యాప్‌టాప్‌ల‌ను లాంఛ్ చేసింది. ఈ క్రమంలో వివోబుక్ ప్రొ 14, వివోబుక్ ప్రొ 15 ఓఎల్ఈడీ, వివోబుక్ ప్రొ 14ఎక్స్ ఓఎల్ఈడీ ల్యాప్‌టాప్‌ల‌ను ఆసుస్ ఆవిష్క‌రించింది.

 
 
ఆసుస్ నుంచి మార్కెట్లోకి వచ్చిన కొత్త ల్యాప్ టాప్‌లో ప్రొఆర్ట్ స్టూడియో బుక్ 16 ఓఎల్ఈడీతో పాటు వివోబుక్ సిరీస్‌తో కూడింది. సృజ‌నాత్మ‌క రంగంలో ఉన్న‌వారికి వినూత్న ఉత్ప‌త్తిగా ప్రొఆర్ట్ సిరీస్‌ను న్యూ టెక్నాల‌జీతో లాంఛ్ చేశామ‌ని ఇండియా సిస్టం బిజినెస్ గ్రూప్, క‌న్జూమ‌ర్ గేమింగ్ పీసీ బిజినెస్ హెడ్ ఆర్నాల్డ్ సూ చెప్పారు.