నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక
నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైందని, మీరు అలా చేయకండి అంటూ హీరోయిన్ రష్మిక చిత్రపరిశ్రమకు చెందిన వారితోపాటు తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. చిత్ర పరిశ్రమలో గత కొన్ని నెలలుగా పని దినాలపై చర్చ సాగుతోంది. దీనిపై రష్మిక మందన్నా తాజాగా స్పందించారు.
ఒక రోజులో నిర్ణీత సమయం కంటే పని చేయడం ఏమాత్రం మంచిది కాదన్నారు. తాను ఎక్కువ గంటలు పని చేస్తాను.. కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది. మీరు అలా చేయకండి కంఫర్ట్‌బుల్ షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకోండి. వీలైతే 9 నుంచి 10 గంటల పాటు నిద్రపోండి. భవిష్యత్‌లో అది మీకెంతో ఉపయోగపడుతుంది అని ఇతర నటీనటులకు ఆమె సలహా ఇచ్చారు.
అలాగే, చిత్రపరిశ్రమలోనూ నిర్ధిష్ట పని వేళలు ఉండాలని తాను కూడా కోరుకుంటున్నట్టు చెప్పారు. కేవలం నటులకే కాదు... దర్శకుల నుంచి లైట్ మ్యాన్ వరకూ అందరికీ అలాగే ఉంటే బాగుంటుంది. దానివల్ల కుటుబంతో గడిపే సమయం దొరుకుతుంది. నేను ఫ్యామిలీపై మరింత దృష్టి పెట్టాలనుకుంటున్నా... ఇంకా ఎక్కువ వ్యాయామం చేయాలనుంది. భవిష్యత్ గురించే నా ఆలోచనంతా, తల్లిని అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో కూడా నేను ఇపుడే ఊహిస్తుంటా అని రష్మిక పేర్కొన్నారు.