బుధవారం, 29 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : మంగళవారం, 28 అక్టోబరు 2025 (21:57 IST)

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

Revanth Reddy Speech
Revanth Reddy Speech
తెలుగు సినీ రంగానికి చెందిన 24 క్రాఫ్ట్ లకు చెందిన కార్మికల సంఘాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి యూసుఫ్ గూడా గ్రౌండ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అభినంద సభ ఏర్పాటు చేశారు.

మరోవైపు జూబ్లీహిల్స్ ఎన్నికలు జరగడం నేపథ్యంకూడా కావడంతో సినీ కార్మికులు అంతా జూబ్లీహిల్స్ పరిధిలోకి వచ్చే యూసుఫ్ గూడా, క్రిష్ణా నగర్, మారుతీ నగర్ చుట్టుపక్కల వేలాది మంది కార్మికులు నివశిస్తున్నారు. కనుక రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో సినీ కార్మికులకు చాలా హామీలు ఇచ్చారు.
 
1. సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్ ను ఏర్పాటుచేయండి ప్రభుత్వం తరఫున 10 కోట్లు ఇస్తానని ప్రకటించారు. ఆ డబ్బును కష్టాల్లో వున్నవారికి, చనిపోయిన వారికి కేటాయించడండి అని సూచన చేశారు.
2. కార్మికులందరికీ ఇండ్ల స్థలాలు కావాలని నాయకులు సూచన చేశారు. కనుక ఫ్యూచర్ సిటీలో వారికి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాను.
3. కార్మికుల ఫెడరేషన్ కూ సరైన భవనం లేదని చెప్పారు. అందుకోసం స్థలం కేటాయించడానికి అనుకూలమైన పరిస్థితులు పరిశీలిస్తా.
4.  సినీ ఫైటర్లు ప్రాక్టీస్ చేసుకునేందుకు సరైన స్థలం లేదు. కనుక ఫ్యూచర్ సిటీలో వారికి ఏర్పాటుచేసేలా చూస్తా.
5. సినిమా టికెట్ల పెంపుకోసం దర్శక నిర్మాతలు, హీరోలు నా వద్దకు వస్తున్నారు. టికెట్ రేటు పెరిగితే లాభ పడేది వారే. కానీ కార్మికులకు రూపాయి రాదు. కనుక కార్మికులకు అందులో 20 శాతం ఇస్తేనే నేను ప్రభుత్వం తరఫున జీ.ఓ. తీసుకువస్తా.
 
అలాగే చిత్రపురి కాలనీ కోసం ప్రముఖ నటులు, అప్పటి కాంగ్రెస్ పెద్దలు 67 ఎకరాలు ఇచ్చారు. అది అభివ్రుద్ధి చెందింది. ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. 
 
మహా భారతంలో గొప్ప పాత్రలున్నాయి. నాకు నచ్చిన కారెక్టర్ కర్ణుడు. ప్రాణం పోతుందని తెలిసినా చిత్ర ధర్మం కోసం ప్రాణాన్ని వదిలాడు. అందుకే త్యాగం గురించి మాట్లాడుకుంటాం. కనుక మిత్ర ధర్మాన్ని పరిష్కరించే బాధ్యత నాది. మీ సమస్యలను పరిష్కరిస్తా.. అంటూ రేవంత్ రెడ్డి తెలిపారు.