ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 మార్చి 2023 (08:37 IST)

ఎస్బీఐ కస్టమర్ల ఖాతాల నుంచి రూ.295 కట్.. ఎందుకో తెలుసా?

sbibank
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకులో ఖాతాలు కలిగిన కస్టమర్ల ఖాతాల నుంచి 295 రూపాయలు డెబిట్ అవుతున్నాయి. ఇలా ఎందుకు కట్ అవుతుందో తెలియక అనేక మంది ఖాతాదారాలు అయోమయంలో పడుతున్నారు. మరికొందరు తమతమ బ్యాంకు శాఖలకు వెళ్లి ఆరా తీస్తున్నారు. దీంతో ఇలా డబ్బులు కట్ కావడానికి గల కారణాన్ని ఎస్.బి.ఐ అధికారులు వెల్లడించారు. 
 
నేషనల్ ఆటోమోటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్.ఏ.సి.హెచ్) సేవల కోసం కస్టమర్ల ఖాతాల నుంచి ఆ డబ్బు కట్ చేస్తున్నట్టు వివరణ ఇచ్చారు. ఖాతాదారుల అకౌంట్ల నుంచి ఈఎంఐలు ఆటోమేటిక్‌ చెల్లింపుల కోసం ఎన్.ఏ.సి.హెచ్‌ను ఉపయోగిస్తున్నారు. మీరు ఈఎంఐపై ఏదేని కొనుగోలు చేసినా లేదా రుణం తీసుకున్నా నిర్ణీత తేదీలో మీ సేవింగ్ ఖాతా నుంచి ఈఎంఐ మొత్తం ఆటోమేటిక్‌గా కట్ చేస్తుంటారు. 
 
ఒకవేళ ఈఎంఐ ఆటోమేటిక్‌గా కట్ కాకపోయినా ఈఎంఐకి తగిన మొత్తం మీ ఖాతాలో లేకపోయినా రూ.295 పెనాల్టీ కట్ చేస్తారు. ఇది కొన్నిసార్లు ఒకేసారి కాకుండా కొన్ని నెలల పాటు పెనాల్టీ కూడబెట్టి ఆపై ఒక్కసారిగా కట్ చేస్తారు. అలాగే, ఈఎంఐ మొత్తానికి తగినంత బ్యాలెన్స్ ఖాతాలో ఉంచడంలో విఫలమైతే బ్యాంకు ఖాతా నుంచి రూ.250 పెనాల్టీ విధిస్తుంది. దీనికి 18 శాతం జీఎస్టీ అంటే రూ.45 అదనం. ఈ రెండింటిని కలిపి రూ.295గాకట్ చేస్తారని బ్యాంకు అధికారులు వివరణ ఇచ్చారు.