బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2022 (15:28 IST)

ఖాతాదారులకు శుభవార్త చెప్పిన కెనరా బ్యాంకు

canara bank
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంకు తన ఖాతాదారులకు ఓ శుభవార్త చెప్పింది. డెబిట్ కార్డులపై రోజువారీ లావాదేవీల పరిమితిని పెంచింది. ఏటీఎంలలో నగదు ఉపసంహరణతో పాటు పీవోఎస్‌ చెల్లింపుల పరంగా పరిమితి పెంచింది. ఈ నిర్ణయాలు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రకటించింది. 
 
కాగా, కెనరా బ్యాంకు డెబిట్ కార్డుల్లో ఇప్పటివరకు రూ.40 వేల వరకు నగదు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉండేది. దీన్ని ఇక నుంచి రూ.75 వేలకు పెంచింది. డెబిట్ కార్డుతో పీవోఎస్ ‌మెషిన్లు, ఈ-కామర్స్ పోర్టళ్ళలో ఒక రోజుకు రూ.లక్ష వరకు చెల్లింపులు చేసుకునే వెసులుబాటు ఉండగా దీన్ని రూ.2 లక్షలకు పెంచింది. 
 
ఇక ప్లాటినం, బిజినస్, సెలెక్ట్ డెబిట్ కార్డులతో ఒక రోజులో ఏటీఎం నుంచి రూ.లక్షను ఉపసంహరించుకోవచ్చు. పీవోఎస్, ఈ-కామర్స్ చెల్లింపుల పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచింది.