శుక్రవారం, 22 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (12:53 IST)

షాకిచ్చిన రిజర్వు బ్యాంకు... మరోమారు రెపో రేట్ల దంచుడు

reserve bank of india
భారతీయ రిజర్వు బ్యాంకు మరోమారు షాకిచ్చింది. రెపో రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ తాజా నిర్ణయతో అర శాతం మేరకు రెపో రేటు పెరిగింది. దీంతో మొత్తం రెపో రేటు 5.90 శాతానికి చేరుకుంది. అలాగే, దేశ వృద్ధి అంచనాలను 7 శాతానికి కుదిరించింది. 
 
తాజాగా సమావేశమైన ఆర్బీఐ అధికారుల నాలుగో విడత కీలక రేపో రేటుు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రేపో రేటును అర శాతం మేరకు పెంచడంతో ఇది 5.90 శాతానికి చేరింది. ఇది మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరినట్టయింది. 
 
ఆర్బీఐ ఈ యేడాది మే నుంచి ఇప్పటి వరకు దఫాల్లో మొత్తం 1.90 శాతం మేరకు రెపో రేటును పెంచిన విషయం తెల్సింద. దీంతో రుణాలపై వడ్డీ రేట్లు కూడా ఇదే స్థాయిలో పెరగనున్నాయి. ఎందుకంటే బ్యాంకులు రేపో ఆధారిత రుణాలనే ఎక్కువగా మంజూరు చేస్తుంటాయి. 
 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను ఆర్బీఐ మరోమారు సవరించింది. గతంలో 7.2 శాతంగా అంచనా వేసిన వృద్ధి రేటును ఇపుడు దీన్ని 7 శాతానికి కుదించింది. ద్రవ్యోల్బణం 7 శాతం స్థాయిలో ఉన్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సం మిగిలిన రెండు త్రైమాసికాలకు 6 శాతం స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. కాగా, ద్రవ్యోల్బణాన్ని నాలుగు శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యంతో ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెల్సిందే.