శనివారం, 22 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 నవంబరు 2025 (12:47 IST)

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Vantalakka
Vantalakka
కార్తీక దీపం సీరియల్ వంటలక్కగా బాగా ఫేమస్ అయిన నటి ప్రేమి విశ్వనాథ్ బిజీ షెడ్యూల్‌‌ను గడుపుతున్నారు. తన బిజీ షెడ్యూల్ కారణంగా భర్త, పిల్లలను కలుసుకోలేకపోతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగులో అవకాశాలు పెరగడంతో బిజీ షెడ్యూల్ వల్ల కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుందని ప్రేమి విశ్వనాథ్ వెల్లడించింది. 
 
తాను కేరళలో ఉన్నప్పుడు కూడా తన భర్త వేరే రాష్ట్రంలో ఉండేవారని, ఇప్పుడు ఇద్దరం పనులతో బిజీగా ఉండటంతో ఒకరినొకరు కలుసుకునేందుకు కూడా సమయం దొరకడం లేదని ప్రేమి విశ్వనాథ్ చెప్పుకొచ్చారు. కెరీర్ పరంగా సంతోషంగా ఉన్నప్పటికీ, కుటుంబానికి దూరంగా ఉండటం బాధ కలిగిస్తోందని ప్రేమి విశ్వనాథ్ తెలిపారు. కేరళకు చెందిన ప్రేమి విశ్వనాథ్ కార్తీక దీపం సీరియల్‌తో తెలుగు బుల్లితెరపై ఎనలేని కీర్తిని సంపాదించుకున్నారు. 
 
ఈ సీరియల్ తొలి భాగం ముగిసిన తర్వాత, అభిమానుల కోరిక మేరకు కార్తీక దీపం: ఇది నవ వసంతం పేరుతో కొత్త భాగాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సీరియల్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.