Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్
Shwetha Menon
రతి నిర్వేదం ఫేమ్ నటి శ్వేతా మీనన్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (AMMA) ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తొలి మహిళా నటిగా రికార్డు నెలకొల్పారు. గతంలో మోహన్ లాల్, మమ్ముట్టి, ఎం.జి. సోమన్ వంటి అగ్రతారలు ఈ పదవిలో పనిచేశారు. ఇలా మూడు దశాబ్ధాలకు పైగా చరిత్ర వున్న అమ్మకు పురుషులు మాత్రమే ప్రెసిడెంట్ పదవికి ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆ రికార్డును శ్వేతా మీనన్ బ్రేక్ చేశారు.
అమ్మ ఎన్నికల్లో శ్వేతా తన ప్రత్యర్థి నటుడు దేవన్‌ను ఓడించి ప్రెసిడెంట్ పదవిని కైవసం చేసుకున్నారు. శ్వేతా మీనన్‌తో పాటు మరికొంతమంది మహిళలు అమ్మలో కీలక పదవులు చేపట్టారు. జనరల్ సెక్రటరీగా కుక్కు పరమేశ్వరన్, ఉపాధ్యక్షురాలిగా లక్ష్మీ ప్రియ, జాయింట్ సెక్రటరీగా అన్సిబా హసన్ ఎన్నికయ్యారు.