చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి తిరిగి రాని లోకాలకు వెళ్లిన ముగ్గురు సోదరీమణులు
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన ముగ్గురు సోదరీమణులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వివర్రాల్లోకి వెళితే.. గాంధీనగర్‌కు చెందిన ఎల్లయ్య గౌడ్ కుమార్తెలు - తనుష, సాయి ప్రియ, నందిని - ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఉన్నారు. సోదరీమణులు ఇటీవల ఒక వివాహానికి హాజరై హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా విషాదం సంభవించిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
మరో హృదయ విదారకమైన విషాదంలో, యాలాల్ మండలంలోని లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి చెందిన అఖిల రెడ్డి అనే యువతి కూడా అదే ప్రమాదంలో మరణించింది. ఎంబీఏ చదువుతున్న అఖిల వారాంతం తర్వాత నగరానికి తిరిగి వస్తుండగా. ప్రమాద స్థలానికి చేరుకున్న ఆమె తల్లి మరియు బంధువులు తమ కుమార్తె అకాల మరణానికి శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇకపోతే టిప్పర్ లారీ అక్రమంగా నిషేధిత టైంలో భారీ లోడ్‌తో సిటీలోకి ఎంట్రీ ఇచ్చిందని తెలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరి, సెప్టెంబర్‌లోనే హైదరాబాద్ పోలీసులు రెండు సార్లు జరిమానా విధించారు. చందానగర్ పరిధిలో ఓసారి, ఆర్. సీ పురం పరిధిలో మరోసారి ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా ఈ లారీ ఎంట్రీ ఇచ్చింది. ఉదిత్య అనిత అనే పేరుతో టిప్పర్ రిజిస్ట్రేషన్ అయ్యింది. ప్రమాద సమయంలో మోతాదుకు మించిన కంకర లోడ్‌తో పాటు ఓవర్ స్పీడే ఈ ప్రమాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు.