మంగళవారం, 11 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 నవంబరు 2025 (09:34 IST)

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం- 17మంది మృతి.. ఆర్టీసీ బస్సులు లారీ ఢీకొనడంతో.. (video)

Chevella Road accident
Chevella Road accident
కర్నూలు బస్సు దుర్ఘటన మరవకముందే చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ గ్రామం సమీపంలో తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకరతో నిండిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో లారీలోని కంకరతో నిండిన లారీ బస్సుపైకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో చాలామంది ప్రయాణికులు చిక్కుకున్నారు. 
 
పోలీసులు, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మూడు జెసిబి యంత్రాలను ఉపయోగించి ప్రమాదంలో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ఆర్టీసీ బస్సు తాండూరు నుండి హైదరాబాద్ కు దాదాపు 70 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తోందని, వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగులు ఆదివారం సెలవుల తర్వాత నగరానికి తిరిగి వస్తున్నారని తెలుస్తోంది. 
Chevella Road Accident
Chevella Road Accident
 
లారీ వేగంగా వచ్చి నియంత్రణ కోల్పోయి అదుపు తప్పి బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో పేలుడు వంటి పెద్ద శబ్దం వచ్చింది. దీని తరువాత స్థానిక గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.