హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల వద్ద నూతనంగా పునరుద్ధరించిన తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలను ప్రారంభిస్తున్నట్లు అమెజాన్ నేడు వెల్లడించింది. ఈ ప్రాంతంలో విద్యా విషయ మౌళిక సదుపాయాలను బలోపేతం చేయటంతో పాటుగా కమ్యూనిటీలను శక్తివంతం చేయాలనే అమెజాన్ యొక్క విస్తృత నిబద్ధతలో భాగంగా ఈ కార్యక్రమం చేయబడింది. పునరుద్ధపరిచిన తరువాత, జిల్లాలో 850 మందికి పైగా విద్యార్థులకు సేవలనందిస్తున్న ఈ పాఠశాల ఇప్పుడు మౌళిక సదుపాయాల కల్పనతో పాటు సివిల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ సౌకర్యాలను కలిగి ఉంది.
ఈ పాఠశాల పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తుంది. విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా, 250 మంది భోజనం చేయటానికి కొత్త డైనింగ్ హాల్‌ను అమెజాన్ నిర్మించింది. దీనితో పాటుగా బాస్కెట్‌బాల్ కోర్టును కొత్తగా ఏర్పాటు చేయటమైనది. కొత్త తరగతి గది ఫర్నిచర్‌ను అందించింది, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్ర ప్రయోగశాలలతో సహా కీలకమైన సైన్స్ సౌకర్యాలను కల్పించటమైనది. కొత్త పుస్తకాలు, ఫర్నిచర్, డిజిటల్ సాధనాలతో పాటు పాఠశాల లైబ్రరీని పూర్తిగా పునరుద్ధరించటంతో పాటుగా ఆధునిక అభ్యాసానికి మద్దతునందిస్తోంది.
ఈ పునరుద్దరణ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన జోడింపుగా ఆన్-గ్రిడ్ 9Kw సౌర విద్యుత్ వ్యవస్థను పాఠశాల పైన ఏర్పాటు చేయడం జరిగింది, ఇది పాఠశాలను మరింత విద్యుత్ పొదుపు చేసేలా తీర్చిదిద్దడంతో పాటుగా పర్యావరణపరంగా అనుకూలంగా మార్చడంను లక్ష్యంగా పెట్టుకుంది. తమ కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా అమెజాన్ మద్దతు ఇచ్చిన నాల్గవ తెలంగాణ మోడల్ స్కూల్ ఇది. చేవెళ్ల నియోజక వర్గ శాసనసభ సభ్యుడు కాలే యాదయ్య; అమెజాన్ ఆసియా-పసిఫిక్ రీజియన్, డేటా సెంటర్ డెలివరీ డైరెక్టర్ అనురాగ్ ఖిల్నాని; అమెజాన్- ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ విక్రమ్ శ్రీధరన్; అమెజాన్, హైదరాబాద్‌లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపరేషన్స్- హైదరాబాద్ క్లస్టర్ లీడర్ శంకర్ శ్రీరామ్ ఎ; వందలాది మంది స్థానిక గ్రామ ప్రజలు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
ఏడబ్ల్యుఎస్, ఆసియా-పసిఫిక్- డేటా సెంటర్ ఆపరేషన్స్ డైరెక్టర్ సాజి పి.కె మాట్లాడుతూ, “సమాజ వృద్ధికి, ఆవిష్కరణలకు పునాదిగా విద్య నిలుస్తుంది, అందుకే ఈరోజు చేవెళ్లలో పునరుద్ధరించబడిన తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీని ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా, మన పరిసర సామాజిక సమూహాలకు, ముఖ్యంగా స్టెమ్ విద్య, స్థానిక నైపుణ్యాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాలలో మార్పు తీసుకురావడంపై అమెజాన్ దృష్టి సారించింది. మెరుగుపరచబడిన సౌకర్యాలతో అభ్యాస ప్రక్రియలను అభివృద్ధి చేయటం ద్వారా, విద్యార్థుల విద్యా ప్రమాణాలకు ప్రయోజనం చేకూర్చే అవకాశాలను సృష్టించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము” అని అన్నారు.
“ఈ పాఠశాల చాలా కాలంగా మా కమ్యూనిటీకి మూలస్తంభంగా ఉంది. మెరుగుపరచబడిన ల్యాబ్‌లు, ఫర్నిచర్ నుండి సౌర విద్యుత్‌తో పనిచేసే మౌళిక సదుపాయాల వరకు ఈ కొత్త సౌకర్యాలతో, విద్యార్థులు నిజంగా ఆధునిక అభ్యాస అనుభవం నుండి ప్రయోజనం పొందుతారు. మా పిల్లల కలల సాకారానికి మద్దతు ఇచ్చినందుకు అమెజాన్‌తో పాటుగా చేయూతనందించిన వారందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము” అని చేవెళ్ల శాసనసభ సభ్యులు కాలే యాదయ్య అన్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా పాఠశాల పరిపాలన విభాగానికి సౌకర్యాలను అధికారికంగా అప్పగించడం, ప్రముఖులు, అతిథుల కోసం గైడెడ్ క్యాంపస్ టూర్, రిబ్బన్ కటింగ్, జెండా ఆవిష్కరణ, సమాజ భాగస్వామ్యాన్ని వేడుకలు జరుపుకునేలా జరిగాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ ప్రారంభంలో, గునగల్లోని తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్లో ఏడబ్ల్యుఎస్ ఇలాంటి పునరుద్ధరణ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో కొత్త లైబ్రరీ, 400 సీట్ల డైనింగ్ హాల్, 20 kW రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్లు, వర్షపు నీటి సేకరణ వ్యవస్థలు మరియు 600 మందికి పైగా విద్యార్థులకు విస్తృతమైన సౌకర్యాల ఆధునీకరణలు ఉన్నాయి.
గత కొద్ది సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో విద్య, సమాజాల అభివృద్ధికి అమెజాన్ అన్ని విధాలా దోహదపడుతుంది. కంపెనీ 12 అమెజాన్ థింక్ బిగ్ స్పేసెస్‌ను ఏర్పాటుచేసింది, దీని ద్వారా ఆధునిక స్టెమ్ అభ్యాస సాధనాలతో 1,700 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. డేటా సెంటర్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ 110 మంది విద్యార్థులకు డేటా సెంటర్ కార్యకలాపాలలో శిక్షణ ఇచ్చింది, 72 మంది విజయవంతంగా ఉపాధిని పొందారు, ప్రస్తుతం 90 మంది ఆ ఉద్యోగాలలో చేరారు. అమెజాన్ ఈ ప్రాంతంలో 25 అంగన్వాడీ కేంద్రాలు, 20 పాఠశాలలను పునరుద్ధరించింది/నిర్మించింది, ప్రస్తుతం మరో రెండు పునరుద్ధరణలు జరుగుతున్నాయి, విద్య అవకాశాలను పొందేందుకు 13 కొత్త కమ్యూనిటీ లైబ్రరీలను ఏర్పాటు చేశారు. ఉదయపు పోషకాహార కార్యక్రమం తెలంగాణ అంతటా ప్రభుత్వ పాఠశాలల్లో 8700 మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తోంది. ఈ ప్రాంతంలోని ఐదు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ పరిష్కారాలు మొత్తం 68 KW సామర్థ్యాన్ని జోడించాయి.