శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 9 మార్చి 2023 (14:16 IST)

సాయి కుమార్, శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రలో మూడో కన్ను

Sai Kumar, Srinivas Reddy
Sai Kumar, Srinivas Reddy
అమెరికాలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా నిర్మిస్తున్న చిత్రం మూడో కన్ను. ఈ ఆంథాలజీ చిత్రానికి నలుగురు కొత్త దర్శకులయిన సూరత్ రాంబాబు, కె బ్రహ్మయ్య ఆచార్య,  కృష్ణమోహన్,  మావిటి సాయి సురేంద్రబాబు వీళ్ళని పరిచయం చేస్తున్నారు. నాలుగు కథలు, నలుగురు దర్శకులు, ఈ కథలో ప్రధాన పాత్ర పోషించిన సాయికుమార్ మాట్లాడుతూ : కొత్త కథతో వస్తున్న కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడానికి ఈ సినిమా చేస్తున్నానని, ఈ సినిమా చేయడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు.
 
ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్ర చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ : కథ అత్యంత ఉత్కంఠ భరితంగా ఉంటుందని చెప్పారు.
అలాగే తెలుగు ఫిలిం దర్శకుల సంఘం అధ్యక్షుల కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ ఫస్ట్ టైం తెలుగు ఫిలిం చరిత్రలో మా యూనియన్ లో మెంబర్ షిప్ ఉన్న నలుగురు కొత్త దర్శకులను ఇంటర్ డ్యూస్  చేస్తున్న మా మెంబెర్ దర్శకుడు కె.వి రాజమహికి ధన్యవాదాలు.  ఈ చిత్రంలో నేను కూడా భాగమైనందుకు ఆనందంగా ఉందని చెప్పారు. 
 
ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన సూర్య, మహేష్ వడ్డి, నిరోష,  కౌశిక్ రెడ్డి, ప్రదీప్ రుద్ర, దయానంద రెడ్డి, శశిధర్ కౌసరి, దేవి ప్రసాద్, మాధవి లత, చిత్రం శ్రీను, సత్య శ్రీ, మధు, దివ్య,  వీర శంకర్, రూప, ఇంకా పలుగురు  మాట్లాడుతూ ఈ చిత్రం అందరూ చూడదగిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్  అని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించబోతున్న కొత్త కాన్సెప్ట్ అని, కొత్త టాలెంట్ తో వస్తున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని  కోరుకున్నారు.
 
అలాగే ఈ చిత్ర నిర్మాతలైన కె.వి రాజమహి మరియు  సునీత రాజేందర్ లు మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించిన సాయికుమార్, శ్రీనివాసరెడ్డి, కాశీ విశ్వనాథ్ మరియు ఇతర నటీనటులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రాన్ని ఆదరించాలని వేడుకున్నారు. ఈ చిత్రానికి కథ కథనం మాటలు కె.వి రాజమహికి  షూటింగ్ ఫినిష్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.