మంగళవారం, 5 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (10:32 IST)

భువన విజయమ్ లో వెన్నెల కిషోర్, సునీల్ తో సెంటిమెంట్ హాస్యం

Vennela Kishore and Sunil
Vennela Kishore and Sunil
ఇద్దరు కమెడియన్స్ ఉంటె ఆడియెన్స్ కు పంట. ఇంకా నలుగురు ఉంటె సందడే సందడి. అది తమ భువన విజయమ్ లో కనిపిస్తున్నదని దర్శకుడు యలమంద చరణ్ అంటున్నారు. సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్, వైవా హర్ష , థర్టీ ఇయర్స్ పృథ్వీ నటిసున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను  డైరెక్టర్ వేణు ఉడుగుల విడుదల చేశారు. హిమాలయ స్టూడియో మాన్షన్స్, మిర్త్ మీడియా బ్యానర్ పై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్నారు.  
 
వేసవిలో విడుదలకు సిద్దమౌతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని దర్శకుడు వేణు ఉడుగుల విడుదల చేశారు. పోస్టర్ లో ప్రధాన తారాగణం సునీల్ , శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, వైవా హర్ష, బిగ్‌బాస్ వాసంతి థర్టీ ఇయర్స్ పృథ్వీ, ధనరాజ్ మిగతా నటులు సీరియస్ లుక్ లో కనిపించడం క్యూరీయాసిటీని పెంచింది.
 
శ్రీమతి లక్ష్మీ సమరిస్తున్న ఈ చిత్రంలో గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్ , సోనియా చౌదరి, స్నేహల్ కామత్, షేకింగ్ శేషు, సత్తి పండు ఇతర తారాగణం.
 
శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సాయి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్. వేసవిలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.