సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (17:12 IST)

ఏసియన్ నమ్రత ప్యాలెస్ హైట్స్ రెస్టారెంట్ ప్రారంభం

jyotiprajvalana by namrata
jyotiprajvalana by namrata
ఏసియన్ నమ్రత గ్రూప్ నూతన రెస్టారెంట్ ‘’ప్యాలెస్ హైట్స్’’ ఈ రోజు గ్రాండ్ గా హైద్రాబాద్ లో ప్రారంభమైయింది. నమ్రత శిరోద్కర్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఏసియన్ గ్రూప్, మినర్వా గ్రూప్ కి చెందిన’ మినర్వా కాఫీ షాప్’ ఇటివలే ప్రారంభమైంది. ‘ప్యాలెస్ హైట్స్’, మినర్వా కాఫీ షాప్’ రెండూ బంజారాహిల్స్ రోడ్ నెం. 12 లో వున్నాయి. ప్యాలెస్ హైట్స్ లగ్జరీ వసతులతో, అద్భుతమైన ఇంటీరియర్ తో రాయల్ డైనింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే రెస్టారెంట్.  జాహన్వి నారంగ్, జేష్ట్య నారంగ్, సునీల్ నారంగ్, భరత్ నారంగ్, శిరీష్ తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
ఇప్పటికే ఈ రెండు గ్రూప్స్ కంబినేషన్లో హైదరాబాద్ లోని మియాపూర్ లో ఏ.ఎం. బి. మాల్ ఏర్పాటు చేశారు. తదుపరి వైజాగ్, విజయవాడ ప్రాంతాల్లో కూడా హోటల్, థియేటర్ వ్యాపారం చేయనున్నారు.