శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (17:07 IST)

ప్రభాస్‌, కృతి సనన్‌ నిశ్చితార్థంపై ట్వీట్‌ చేసిన ఉమైర్‌ సందు

prabhas-kriti
prabhas-kriti
రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ వివాహం ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తుండగా కొద్దిసేపటి క్రితమే బాలీవుడ్‌ సినీ క్రిటిక్‌ ఉమైర్‌ సందు తన ట్వీట్‌లో ఇద్దరికీ వివాహం జరగబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా వచ్చేవారమే నిశ్చితార్థం అంటూ పోస్ట్‌ చేశాడు. దీంతో నిముషాల్లో ఈ న్యూస్‌ వైరల్‌ అయింది. ఇటీవలే బాలకృష్ణ అన్‌ స్టాపబుల్‌లో పెండ్లి గురించి అడిగితే ప్రభాస్‌ ఎటువంటి సమాధానం చెప్పలేదు. 
 
కాగా, వచ్చే వారంలో మాల్దీవీస్‌లో ప్రభాస్‌, కృతి సనన్‌ నిశ్చితార్థం జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే వీరు ఆదిపురుష్‌ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వుంది. షూటింగ్‌ పూర్తి చేయాల్సి వుంది. ఇదిలా వుండగా, అనుష్కను ప్రభాస్‌ చేసుకోనున్నాడనే వార్తలు అప్పట్లో వినిపించాయి. దీంతో ఇక ఫుల్‌స్టాప్‌ పడే సూచనలు కనిపిస్తున్నాయి.