బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో నిధి అగర్వాల్
pawan, balayya katout vijayawada
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ తో పాటు ఆ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ కూడా ఈ షో లో మెరిసింది. ఎపిసోడ్ మధ్య లో వీడియో కాల్ లో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లతో ముచ్చటించింది. ఆ చిత్ర విశేషాలతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు ఆమె ఈ షో లో పంచుకుంది.
ఈ ఎపిసోడ్ ఈరోజు రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఇందుకు సంబందించిన ఎపిసోడ్ ను ముందుగానే సినీ ప్రముఖులు చూడనున్నారు. హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో సాయంత్రం ప్రదర్శించనున్నారు. ఇది ఇలా ఉండగా, విజయవాడలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కు చెందిన కటౌట్ ఆహ ఓ.టి.టి. ఏర్పాటు చేసింది.