బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (18:37 IST)

బాలయ్యకు కృతజ్ఞతలు.. నా అల్లుడిని కాపాడారు.. విజయసాయి రెడ్డి

vijayasaireddy
నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో తారకరత్నను పరామర్శించిన అనంతరం మీడియా ముందు విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎలాంటి గుండె సమస్యలు లేవని, రక్తప్రసరణ సక్రమంగా ఉందని తెలిపారు.
 
విజయసాయి రెడ్డి ప్రకారం, తారకరత్న మెదడులో వాపు నుండి కోలుకునే మార్గంలో ఉన్నారని, వారి అద్భుతమైన చికిత్స కోసం వైద్య బృందాన్ని ప్రశంసించారు. నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. బాలయ్య పర్యవేక్షణ, తారకరత్నకు అవసరమైన చికిత్స అందించినందుకు విజయసాయి రెడ్డి కృతజ్ఞతలు వెల్లడించారు. 
 
తారకరత్న.. విజయసాయిరెడ్డి భార్య సునంద చెల్లెలు కుమార్తె అలేఖ్యారెడ్డిని వివాహం చేసుకున్నారు. దీంతో తారకరత్న విజయసాయిరెడ్డికి అల్లుడు అవుతారు.