గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

తారకరత్న విషయంలో మిరాకిల్ జరిగింది.. హీరో బాలకృష్ణ

balaakrishna
హీరో నందమూరి తారకరత్న విషయంలో మిరాకిల్ జరిగిందని నటుడు బాలకృష్ణ అన్నారు. నారా లోకేశ్ యువగళం యాత్రలో తీవ్ర అస్వస్థతకు లోనైన తారకరత్న ప్రస్తుతం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఎక్మోపై చికిత్స అందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌, బాలకృష్ణలు ఆదివారం తన కుటుంబ సభ్యులతో ఆస్పత్రికి వెళ్లి తారకరత్నను చూశారు. 
 
ఆ తర్వాత ఆస్పత్రి వద్ద బాలయ్య విలేకరులతో మాట్లాడుతూ, తారకరత్న విషయంలో మిరాకిల్ జరిగిందన్నారు. తొలుత ఆయన గుండె ఆగిపోయిందని, ఆ తర్వాత తిరిగి కొట్టుకోవడం ప్రారంభించిందని చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. అభిమానుల దీవెనలు, ప్రార్థనలతో త్వరలోనే కోలుకుంటాడని చెప్పారు. మరింత పురోగతి కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. 
 
ప్రస్తుతం కుప్పం తీసుకొచ్చినపుడు ఉన్నట్టుగానే తారకరత్న ఆరోగ్య పసిస్థితి ఉందని ఆయన తెలిపారు. వైద్యులు అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు. అంతర్గత రక్తస్రావం కారణంగా తారకరత్నకు స్టెంట్ వేయడం కుదరలేదని చెప్పారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై ఉన్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని చెప్పారు.