ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 24 జనవరి 2023 (10:26 IST)

జై బాలయ్య అంటూ బాలకృష్ణ దీవెనలందుకున్న హనీరోజ్‌

Honeyrose blessed by Balakrishna
Honeyrose blessed by Balakrishna
నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రంలో హనీరోజ్‌ నటించింది. ఇటీవల జరిగిన సక్సెస్‌ మీట్‌లో బాలకృష్ణ ఆశీర్వాదం కోరింది. జైబాలయ్య అంటూ బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని షూటింగ్‌లో ఆయన చూపిన మర్యాదలను ఆమె కితాబిచ్చింది. ఊరికే ఎవరూ స్టార్‌ కారంటూ జైబాలయ్య అంటూ నినదించింది. అనంతరం బాలయ్యఆశీర్వాదాలు అందుకుంది. ఇది తన సోషల్‌ మీడియలో పోస్ట్‌ చేస్తూ జైబాలయ్య ఆశీర్వాదం పొందాను అని పేర్కొంది.
 
Honeyrose, Balakrishna
Honeyrose, Balakrishna
అయితే నందమూరి అభిమానులు మాత్రం సోషల్‌మీడియాలో వీరిద్దరూ కలిసిన ఓ ఫొటోను పోస్ట్‌ చేసి ఎన్‌.టి.కె.108లో పాత్ర పోషిస్తుంది అని వెల్లడించారు. ఇద్దరూ గాజుగ్లాస్‌లో ఏదో తాగుతూ ఒకరిచేయి ఒకరు మెలేసుకున్న ఫొటోను షేర్‌ చేశారు. చాలామంది అభిమానులు ఆమెకు కంగ్రాట్స్‌ చెప్పగా, ఒకరిద్దరు మాత్రం భయ్యా ఇది ఫేక్‌ అనుకుంటా అంటూ కామెంట్‌ చేశాడు. ఏదిఏమైనా బాలకృష్ణ సినిమాలలో తాను నటించాలనుందని వీరసింహారెడ్డి విడుదలకుముందు జరిగిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో హనీరోజ్‌ తన కోరికను వ్యక్తం చేసింది. సో. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.