ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 జనవరి 2023 (13:46 IST)

వీరసింహారెడ్డి కలెక్షన్లు అదుర్స్.. రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిందిగా...

veerasimhareddy
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి విడుదలైంది. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా కలెక్షన్ల బలంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే యూఎస్‌లో ఒక మిలియన్‌కి పైగా వసూలను రాబట్టింది. 
 
వీర సింహారెడ్డి సినిమా 3 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 50 కోట్లకు పైగా గ్రాస్‌లు అందుకోగా ప్రపంచవ్యాప్తంగా 73.9 కోట్ల రేంజ్‌లో గ్రాస్‌ని కలెక్షన్స్‌ని సొంతం చేసుకుంది. 
 
ఈ సినిమా నాలుగు రోజులకు కాను తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 70 కోట్ల రేంజ్‌లో గ్రాస్ మార్కుని అందుకుంది. తద్వారా బాలయ్య వీరసింహారెడ్డి రూ.100 కోట్ల శిఖరానికి చేరుకున్నట్లేనని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. 

అంతేగాకుండా పుష్ప రికార్డును క్రాస్ చేసింది. పుష్ప సినిమా రెండు రాష్ట్రాలలో కలిపి మొదటి రోజే 24.90 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. తాజాగా ఈ షేర్‌ను నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి 25.36 కోట్ల షేర్లతో దాటేసింది.