బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 12 జనవరి 2023 (21:46 IST)

వీర సింహారెడ్డి కథ గురించి నిజం చెప్పేసిన నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna
Nandamuri Balakrishna
ఈరోజే విడుదలైన వీర సింహారెడ్డి చిత్రం ఓపెనింగ్స్‌తో షేక్‌ ఆడిస్తుందని నిర్మాతలు మైత్రీ మూవీమేకర్స్‌ తెలియజేస్తున్నారు. ఈరోజు రాత్రి జరిగిన విజయ సభలో వారు మాట్లాడారు. సినిమాలో ఫైట్స్‌, డాన్స్‌, మ్యూజిక్‌ బాగుందని, థమన్‌ బాక్స్‌లు పగిలిపోయేలా హోరె ఎత్తించాడని తెలిపారు. ఇలా సినిమాలో పనిచేసిన వారంతా తమ అనుభవాలను వెల్లడి చేశారు.
 
ఇక బాలకృష్ణ మాట్లాడుతూ, ఈ కథ వినగానే ఎన్నో ఫాక్షన్‌ సినిమాలు చేశాను. ఏదో కొత్తదనం కోసం చూశాను. ఇది పెద్ద కథేమీకాదు. ఓల్డ్‌ వైన్‌ విత్‌ న్యూ బాటిల్‌. దీనికి సిస్టర్‌ సెంటిమెంట్‌ జోడించాం. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ బాగా చేసింది. అన్న చెల్లెలు సెంటిమెంట్‌ నాన్నగారు చేశారు. రక్తసంబంధం లాంటి పాయింట్‌ ఇందులో వుంది. ఇది చివరివరకు చెప్పకూడదని దాచాం. ఇప్పుడు ఈ సినిమాకు మంచి ఆదరణ వస్తోంది. క్లయిమాక్స్‌లో అందరినీ వరలక్ష్మీ ఏడిపించింది అని చెప్పారు.