శుక్రవారం, 1 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 12 జనవరి 2023 (15:52 IST)

బాలకృష్ణ, చిరంజీవి కలిసి ఒకే వేదికపైకి వస్తే!

balayya- chitu
balayya- chitu
ఇటీవలే మెగాస్టార్‌ చిరంజీవికి ఓ ప్రశ్న ఎదురైంది. తను లేటెస్ట్‌గా వాల్తేర్‌ వీరయ్య సినిమా చేశాడు. ఆ చిత్రం ప్రమోషన్‌లో చాలా బిజీగా వున్నారు. శుక్రవారమే విడుదలకాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో రవితేజ, చిరంజీవి కలిసి ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ తర్వాత కొంతమంది మీడియాతో సమావేశమయ్యారు. అయితే, ఈ సినిమాలో రవితేజ డైలాగ్‌ను చిరంజీవి, చిరంజీవి డైలాగ్‌ను రవితేజ చెప్పేవిధంగా ప్రమోషన్‌ చేశారు. ఇలా చేయడం చాలా సరదాగా వుంటుంది. సరికొత్తగా ఉంటుందని చిరంజీవి బదులిచ్చారు.
 
ఈ సందర్భంగా ఓ ప్రశ్న తలెత్తింది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య కలిసి ఒకే బేనర్‌ మైత్రీ మూవీమేకర్స్‌లో నటించారు. కనుక ఒకరి సినిమాకు మరొకరు పబ్లిసిటీ చేసుకునేలా స్టేజీపై వుంటే ఎలా వుంటుందన్న ప్రశ్నకు చిరంజీవి, కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే, ఎవరిసినిమాను వారు ప్రమోట్‌ చేసుకోవాలి. అలా చేయడం నిర్మాణ సంస్థకు ఉపయోగమో లేదో నాకు తెలీదు. అంటూ దాట వేశారు. అన్ని సినిమాలు ఆడాలి అందరూ బాగుండాలని ముగింపు ఇచ్చారు.