1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 11 జనవరి 2023 (15:59 IST)

ప్రశంసలు కురిపించిన చిరంజీవి, పవన్ కళ్యాణ్, సుకుమార్, బాలకృష్ణ

keeravani award
keeravani award
ఆర్.ఆర్.ఆర్. చిత్ర గీతానికి గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కడం సంతోషదాయకం అని  చిరంజీవి, పవన్ కళ్యాణ్, సుకుమార్, బాలకృష్ణ తమ ప్రకటనలో పేర్కొన్నారు. `ఈరోజు ఉదయం నాకు చాల ఎనర్జీ ఇచ్చిన రోజు. గ్లోబ్ అవార్డు ఆర్.ఆర్.ఆర్. టీంకు రావడం నాకు వచ్చినంత ఆనందంగా ఉంది. ఇది ఎంతో అపూర్వమైన, చారిత్రాత్మక విజయం అని చిరంజీవి అన్నారు. ఎస్ ఎస్ రాజమౌళి, కీరవాణి, చరణ్, ఎన్ టి. ఆర్. కు  అభినందనలు అంటూ చెప్పుకొచ్చారు.
 
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,  ఆర్.ఆర్.ఆర్. చిత్రంలోని ‘నాటు నాటు...’ గీతానికి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కడం భారతీయులందరూ ఎంతో సంతోషించదగ్గ పరిణామం. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకొన్న ఈ గీతానికి స్వరకల్పన చేసిన శ్రీ ఎం.ఎం.కీరవాణి గారికి అభినందనలు. తెలుగు గీతానికి ఉన్న కీరిప్రతిష్టలను గోల్డెన్ గ్లోబ్ పురస్కారం మరింత ఇనుమడింపచేస్తుంది. ‘నాటు నాటు’ గీతాన్ని రచించిన శ్రీ చంద్రబోస్, ఆలపించిన గాయకులు శ్రీ రాహుల్ సిప్లిగంజ్, శ్రీ కాలభైరవలకు ప్రత్యేక అభినందనలు. ఆస్కార్ పురస్కారం కోసం పోటీపడుతున్న ఈ చిత్రం ఆ వేదికపైనా పురస్కారాలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయి ప్రశంసలు పొందేలా రూపుదిద్దిన దర్శకుడు శ్రీ రాజమౌళి, చిత్ర కథానాయకులు శ్రీ రాంచరణ్, శ్రీ ఎన్టీఆర్, నిర్మాత శ్రీ డి.వి.వి.దానయ్య అభినందనీయులు త్తెలిపారు. 
 
ఇక సుకుమార్ అయితే, రాజమౌళి ప్రసంగిస్తున్న ఫోటో పెట్టి అయితే రాజమౌళి ని “నా హీరో” అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ఆర్.ఆర్.ఆర్. చిత్రంలోని అందరికి శుభాకాంక్షలు అని బాలకృష్ణ పోస్ట్ చేసారు.