సంబంధిత వార్తలు
- ప్రయాణికులకు శుభవార్త.. విజయవాడ రైల్వే స్టేషన్‌లో మసాజ్ సెంటర్
- చిత్తకార్తె కుక్కలు మొరుగుతున్నాయ్.. నక్కా ఆనందబాబు
- కామంతో కాళ్లు నాకావు అనుకున్నాం... డబ్బుకోసం ఏమైనా నాకుతావా వర్మ!
- 10-01-2023 మంగళవారం దినఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధించడంవల్ల...
- బాలకృష్ణ 'వీరసింహారెడ్డి'కి సెన్సార్ పూర్తి - యూఏ సర్టిఫికేట్ మంజూరు
కాపు జాతిని లాగావో నీ తాట తీస్తాం.. వర్మకు కాపు నేతల హెచ్చరిక
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు కాపు సామాజిక వర్గానికి చెందిన సంఘాల నేతలు బహిరంగ హెచ్చరిక చేశారు. రాజకీయ వివాదాల్లోకి కాపు సామాజిక వర్గానికి లాగితే తాట తీస్తామంటూ హెచ్చరించారు. రాజకీయంగా టీపీడీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లను ఎన్ని రకాలుగానైనా విమర్శించుకోండి. కానీ, కాపు ప్రజలను లాగితే మాత్రం సహించే ప్రసక్తే లేదని వారు హెచ్చరించారు.
చంద్రబాబు - పవన్ భేటీ రాంగోపాల్ వర్మ స్పందిస్తూ, "రిప్ కాపులు.. కంగ్రాట్స్ కమ్మోళ్లు" అంటూ ట్వీట్ చేశారు. దీనిపై కాపు సంఘాలకు చెందిన పలువురు నేతలు మీడియా ముందుకు వచ్చి ఆర్జీవికి హెచ్చరికలు చేశారు. తమను కించపరిస్తే సహించే ప్రసక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చి, పిచ్చి వ్యాఖఅయలు చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు.
ఆర్జీవీ ఇటువంటి పిచ్చిమాటలు, వేషాలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. గతంలో కూడా వంగవీటి రంగాపై ఆయన చేసిన సైకో వ్యాఖ్యలు మర్చిపోకముందే ఇపుడు కాపుల గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. పవన్‌ను వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ, ఆ వివాదాల్లోకి కాపు జాతిని తీసుకుని రావొద్దని రాష్ట్రమంత్రులను కోరారు. లేదంటే తమ సత్తా ఏంటో ఓట్ల రూపంలో చూపిస్తామని మందలించారు.
