బుధవారం, 29 నవంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 9 జనవరి 2023 (20:33 IST)

బాలకృష్ణ 'వీరసింహారెడ్డి'కి సెన్సార్ పూర్తి - యూఏ సర్టిఫికేట్ మంజూరు

veerasimhareddy
నటసింహం నందమూరి బాలకృష్ణ - శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం "వీరసింహారెడ్డి". వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. దునియా విజయ్ ప్రతినాయకుడు. గోపీచంద్ మలినేని దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై నిర్మించారు. ఈ నెల 12వ తేదీన విడుదలకానుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
 
ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు యూఏ సర్టిఫికేట్‌ను మంజూరు చేశారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల ఒంగోలు వేదికగా జరిగింది. మరోవైపు, ఈ మూవీ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. బాలకృష్ణ చెప్పిన డైలాగులు అభిమానలను ఉర్రూతలూగిస్తున్నాయి. సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. కర్నూలు ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు.