గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

10-01-2023 మంగళవారం దినఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధించడంవల్ల...

Sagitarus
మేషం :- మీ శ్రీమతి సలహా పాటించటం వల్ల మేలే జరుగుతుంది. పత్రికా సిబ్బందికి తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. వాహనం ఏకాగ్రతతో నడపటం క్షేమదాయకం. మీ మాటకు సర్వత్రా మంచి స్పందన లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తాయి.
 
వృషభం :- ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సమయానికి మిత్రులు సమకరించక పోవటంతో సంప్రదింపులు జరుపుతారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. సంంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పొంతుతారు. విద్యార్థులకు సహచరులతో సాన్నిత్యం నెలకొంటుంది. 
 
మిథునం :- రాజకీయ నాయకుల పర్యటనల్లో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. ఇతరులపై ఆధారపడక స్వయం కృషినే నమ్ముకోవడం మంచిది. ఉపాధ్యాయులు విమర్శలు ఎదుర్కొవలసివస్తుంది. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. ధనం ఎవరికైనా ఇచ్చినా తిరిగి రాజాలదు. కానివేళలో బంధువులరాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
కర్కాటకం :- రావలసిన బకాయిలు సకాలంలో అందిన ధనం ఏమాత్రం నిల్వ చేయలేరు. దూర ప్రయాణాలు అనుకూలిస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. తల పెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కుంటారు.
 
సింహం :- మంచివారితో పరిచయం మీ అభివృద్ధికి దోహదపడుతుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. చిట్స్, ఫైనాన్సు రంగాల వారికి ఒత్తిడి తప్పదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త, సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. చేతిలో ధనం మితంగా ఉండటంతో ఆందోళన చెందుతారు.
 
కన్య :- ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ధనం కంటే ఆత్మగౌరవానికే ప్రాధాన్యం ఇస్తారు. మనుష్యుల మనస్థత్వము తెలిసి మసలు కొనుట మంచిది.
 
తుల :- మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. మీ పొదుపరితనం కుటుంబ సభ్యులకు చికాకు కలిగిస్తుంది. రాజకీయాల్లో వారికి కార్యకర్తలవల్ల ఇబ్బందులుతప్పవు.
 
వృశ్చికం :- మీ శ్రీవారి మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. నిర్మాణ పనులలో జాప్యం, పెరిగిన వ్యయం వల్ల ఆందోళనకు గురవుతారు. ఇతరుల సలహా కంటే సొంత నిర్ణయాలే మేలు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసివస్తాయి. మానసిక ఆందోళన వల్ల ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు.
 
ధనస్సు :- స్త్రీలలో ఆత్మవిశ్వసం రెట్టింపవుతుంది. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. ఒక అనుభవం మీకెంతో జ్ఞానాన్ని ఇస్తుంది. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది.
 
మకరం :- కలిసివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. హోటల్, తిను బండారు వ్యాపారులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. బాధ్యతలు పెరిగినా మీ సమర్థతను నిరూపించుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
కుంభం :- ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, చికాకులు అధికం. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించవు. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారం లభిస్తుంది. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు.
 
మీనం :- ఆర్థిక విషయాలలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఆలయాలను సందర్శిస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరంచేస్తారు.